YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దేశానికి ఆదర్శంగా తెలంగాణ సంక్షేమ పథకాలు

దేశానికి ఆదర్శంగా తెలంగాణ సంక్షేమ పథకాలు

హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలతో పాటు బయటి దేశాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ స్థానిక కార్పొరేటర్స్ తో కలసి 28లక్షల కల్యాణ లక్ష్మి, షాదీముభారాక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ... ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 150కోట్ల షాదిముబారక్, కల్యాణ లక్ష్మి నిధులు తన చేతులమీదుగా అందించానని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని,ఇలాంటి పథకం దేశానికే ఆదర్శం అని అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి 4000వేల డబుల్ బెడ్రూమ్స్ కేటాయించడం పై ముఖ్యమంత్రి కేసీఆర్ కి దానం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Related Posts