YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్
తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉదయం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్లో 82.07 శాతం విద్యార్థులు అర్హత సాధించగా...అగ్రికల్చర్ మెడికల్లో 98.48 శాతం మంది విద్యార్థులు అర్హత పొందారు. ఇంజనీరింగ్ విభాగంలో సత్తి కార్తికేయ(వెస్ట్ గోదావరి, ఏపీ) ఫస్ట్  ర్యాంకర్గా నిలిచారు. అలాగే వెంకట ప్రణీత్(రాజంపేట, కడప)కు సెకండ్ ర్యాంక్ రాగా, ఎండీ మతిన్ (హైదరాబాద్, టోలిచౌకి)మూడో ర్యాంక్ సాధించారు. అలాగే అగ్రికల్చర్ అండ్  మెడికల్ విభాగంలో మండవ కార్తికేయ( బాలానగర్, హైదరాబాద్) ఫస్ట్ ర్యాంక్ సాధించగా...హిమని శ్రినిజ (రంగారెడ్డి)సెంకండ్ ర్యాంకర్గా నిలిచారు.  ఈనెల 30 నుంచి రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఈ ఏడాది జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌ పరీక్షకు 90 శాతం మంది హాజరుకాగా… అగ్రికల్చర్‌, మెడికల్‌ ఎంట్రన్స్‌కు 91.19 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

Related Posts