జగిత్యాల ఆగస్టు 25
వెనుకబడిన తరగతుల క్రీమీలేయర్ నిర్దారణకు ఆర్థిక పరిస్థితులు ఒక్కటే ప్రాతిపదిక కారాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని టీబీసీజేఏసి రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది హరి అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు హర్యానా ప్రభుత్వం గతంలో జారీచేసిన నోటిఫికేషన్ తీవ్రమైన తప్పిదమని పేర్కొంటూ దాన్ని కొట్టేసిందని ,వచ్చే మూడు నెలల్లోగా కొత్త నోటిఫికేషన్ జారీచేయాలని ఆదేశించినట్లు వివరించారు.క్రీమీలేయర్ నిర్దారణకు హర్యానా ప్రభుత్వం సామాజిక, ఇతరత్రా స్థితిగతులను పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలైంది. ఈ మేరకు సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసిందని,విచారణ సందర్భంగా ఇందిరా సాహ్ని కేసును ప్రస్తావించిందన్నారు.ఐఏఎస్,ఐపీఎస్ వంటి అతి ఉన్నత ఉద్యోగాలు పొందిన వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తులు సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరారని, వారిని వెనుకబడిన వారిగా పరిగణించరాదని తీర్పులో పేర్కొన్న అంశాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేసిందని బీసీ వర్గాల సమాచారార్థం తెలిపారు.