సత్యసాయి సెంట్రల్ కమిటీ సభ్యుడు విజయభాస్కర్ గుండెపోటుతో ముంబై లో మృతి చెందారు. .శుక్రవారం ముంబై లోని ధర్మక్షేత్రంలో పూజా మందిరంలో పూజలో పాల్గొని భజన చేస్తున్న సమయంలో తీవ్రమైన గుండెపోటుకు గురై అయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యునిగా 2016లో నవంబర్ లో సత్యసాయి జన్మదినసందర్బంగా అయన బాధ్యతలు స్వీకరించారు. అంతకు మునుపు ఆయన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు. సత్యసాయి ఉన్నతవిద్యాసంస్థలో మొదటి బ్యాచ్ విద్యార్థిగా ప్రశాంతినిలయం లో విద్యను అభ్యసించారు. సత్యసాయి భక్తునిగా కొనసాగుతూ సేవాకార్యక్రమాలు నిర్వహించేవారు . జర్వ్ బ్యాంకు నుండి పదవీ విరమణ పొందాక 2016 లో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యునిగా నియామకం పొందారు. ట్రస్ట్ కార్యక్రమాలలో చురుకైన పాత్రను పోషించేవారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యునిగా చేరిన తక్షణమే నిత్యాన్నదాన పథకాన్ని ప్రవేశపెట్టాలని ట్రస్ట్ సమావేశంలో ప్రతిపాదించారు. నిధుల సమస్య అడ్డంకి కాదని అన్ని తానై రూపశిల్పిగా పథకం ఆచరణలో అమలుపరిచిన ఘనతను పొందారు. మృదు స్వభావిగా ఇతర ట్రస్ట్ సభ్యులతో స్నేహంగా మేలుగుతూ ట్రస్ట్ వ్యవహారాలలో కీలక వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన స్వస్థలం కాకినాడ. హైదరాబాద్ లో కుటుంబంలో స్థిరపడింది. ఆయన మృతిపట్ల సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.