ఉర్దూను రెండో అధికార భాషగా..15 సూత్రాల అమలును పకడ్బందీగా అమలు చేయండి..!
జిల్లా కలెక్టర్ కు అంజుమన్ తరక్ఖి ఉర్దూ..ఖాధిమానే మిల్లత్ సొసైటీ విజ్ఞప్తి
కరీంనగర్
రాష్ట్రంలో రెండో అధికార భాషగా ఉన్న ఉర్దూను కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా.. మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పకడ్బందీగా అమలు చేయాలని అంజుమన్ తరక్ఖి ఉర్దూ కరీంనగర్, ఖాధిమానే మిల్లత్ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కు వినతిపత్రం అందజేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమిటీ కార్యదర్శి సమద్ నవాబ్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా.. మున్సిపల్ కార్పోరేషన్ 60 డివిజన్లలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్డులపై.. కాలనీల బోర్డులపై పేర్లను ఉర్దూలో వ్రాయించేలా..అధికారికంగా ఉర్దూను రెండో అధికార భాషగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే 15 సూత్రాల అమలు పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. గత 7 సంవత్సరాలుగా 15 సూత్రాల అమలు..మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలపై ఒక్కసారి కూడా సమీక్ష సమావేశం జరగలేదని తక్షణమే సమావేశం నిర్వహించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కలెక్టర్ ఉర్దూ భాష అమలుకై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయం ఏవో ను ఆదేశించారు. 15 సూత్రాల అమలు సమీక్ష నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా డిఎండబ్ల్యుఓ ను కలెక్టర్ ఆదేశించారు. ఈకార్యక్రమంలో మక్బూల్ హుస్సేన్, హామీదోద్దీన్, ఖురేషీ, ఇమామోద్దీన్, ఇజ్హర్ హుస్సేన్, అబ్దుల్ మాజిద్, ఇమ్రాన్, ముత్తహరోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.