వరుణుడు కోపమో ,రైతన్న సాపమో తెలియదు కానీ ప్రకృతి రైతున్నపై కన్నెర్ర చేయడంతో సాగుచేసే రైతన్న కంటతడి పెడుతున్నాడు. వాతావరణం మార్పులతో ఈ మధ్య జిల్లాలో ఆకాలంగా ఈదురు గాలులు తో కూడుకున్న భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఉక్కపోతతో తల్లడిలిన సామాన్య ప్రజలకు కాస్త ఉపశమనం లభించినా పంట పొలాల్లో నీరు చేరి వరి, మొక్క జొన్న నీటిమునగగా ,ఈదురు గాలులకు ఉద్యాన పంటలు అరటి ,మామిడి ,జీడీ పంట నేలపాలు అయ్యాయి ఉత్తరాంధ్రలో వెనుకుబడిన జిల్లా విజయనగరం. ఈ జిల్లాలో అత్యధిక శాతం వర్షదారం పై ఆధారపడిన భూములే. మరికొన్ని ప్రాంతాల్లో నదులకు కాలువలకు అనుకోని ఉన్న భూములో వరి పంట, మొక్కజొన్న ను రైతులు సాగుచేస్తారు. అకాల వర్షాలతో జిల్లాలో జియ్యంవలస ,కోమరాడ, మెంటాడ, బొడ్డపల్లి ,పూసపాటిరేగా, మక్కువ మండలాల్లో వరి పంటను కోతలు కోసి పంట పొలంలో ఆరబెట్టి కల్లానికి చేర్చుదామనుకునే సమయంలో అకాల వర్షం రూపంలో శని దాపురిచింది. ఏడాది పొడవునా కష్టించి, కాయకష్టం చేసి అప్పు సొప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పండించిన పంట చేతికి అందివచ్చిన సమయంలో నీటిపాలు కావడంతో రైతన్న లబో దిబో మంటూ కంటతడి పెడుతున్నాడు. ఇక కొన్ని ప్రాంతాలలో ఉద్యానవన పంటల అరటి ,జీడీ మామిడి పంటలు ఈదురు గాలులు తో నెలమట్టమై రైతు వెన్ను విరిగింది.వేలాది , లక్షలాది రూపాయలు వెచ్చించి సాగుచేసిన పంట చేతికి అందక నెలపాలు కావడంతో రైతు వేదన అంతాఇంతా కాదు. అధికారులు పాలకులు స్పందించి తమకు నాయ్యం చేయాలనీ కోరుతున్నారు.