కేసీఆర్ ఒంటరివాడయ్యారు
రేవంత్ రెడ్డి
హైదరాబాద్
మూడు చింతల పల్లి దీక్ష వద్ద పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్ళు అధికారం మనదే అన్నప్పుడే కేసీఆర్ తన ఓటమిని అంగీకరించినట్లు. కేసీఆర్ కు 20 నెలల భయం పట్టుకుంది. మొదటి సారి కేసీఆర్ లో భయం కనిపిస్తుంది అందుకే అంచనాలు లేని హామీలు ఇస్తున్నారు. టిఆర్ఎస్ కార్యవర్గ సమావేశం తరువాత పార్టీలో సీనియర్లు ఎవరు బ్రీఫ్ చేయలేదు. ఆఖరుకు కేసీఆర్ ఆవేదన చూసి కేటీఆర్ మీడియా సమావేశం పెట్టారు. టీఆరెఎస్ లో ఉద్దండులు మీడియా ముందు కు రావడానికి బయపడుతున్నారు. భవిష్యత్ లో టిఆర్ఎస్ సీనియర్ లీడర్లు కేసీఆర్ పక్కన కూర్చోడానికి బయపడతారు. కేసీఆర్ ఒంటరి వాడు అయ్యాడు. కేసీఆర్ ప్రజల్లో బ్రమలు కల్పిస్తున్నారు.. ఆ బ్రమల్లోనుంచి జనాలు ఇప్పుడు బయటకు వస్తున్నారని అన్నారు.
నేను రాత్రి దళిత వాడలో పడుకున్న ఇళ్ళు 35 సంవత్సరాల క్రితం నాటి ఇందిరమ్మ ఇళ్ళు . మూడు చింతల పల్లి గ్రామానికి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదు. మూడు చింతలపల్లి లో కేసీఆర్ ఫౌంమౌస్ కోసం రోడ్డును రెండు సంవత్సరా ల క్రితం 6ఫీట్లు పెంచి వేసారని అన్నారు.
ఇళ్ళు కిందకి అయినయ్ ,రోడ్డు పైకి అయింది. డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తా అని ఇంతవరకు ఇవ్వలేదు. వర్షం పడగానే ఆ ఇళ్ళు చెరువులా మారుతున్నాయి. దలిత బందు అందరికీ ఇవ్వాలనేది మా డిమాండ్. బడ్జెట్ సరిపోక పోతే సెక్రటరియేట్ ,అసెంబ్లీ అమ్ముదం...ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు పెడ్తాం. జీహెచ్ఎంసీ లో అందరికీ పది వేల సహాయం ఇవ్వని కేసీఆర్.. దలితులందరికీ దళితబందు ఇస్తామంటే నమ్ముతమా అని ప్రశ్నించారు. ..