YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్ లో  గుప్పుమన్న వర్గ విభేదాలు

కాంగ్రెస్ లో  గుప్పుమన్న వర్గ విభేదాలు

కాంగ్రెస్ లో  గుప్పుమన్న వర్గ విభేదాలు
బెల్లంపల్లి ఆగస్ట్ 25 :
బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో ప్రేమ్ సాగర్ రావు, మాజీ మంత్రి గడ్డం వినోద్ వర్గాల మధ్య విబేధాలు వర్గ విబేధాలు బగ్గుమన్నాయి.బుధవారం  బెల్లంపల్లి పట్టణం కాంగ్రెస్ కార్యాలయంలో  గడ్డం వినోద్ జిల్లా స్థాయి నాయకులకు సమాచారం ఇవ్వకుండా సమావేశం ఏర్పాటు చేయడం సరికాదని అడ్డుకున్న ప్రేమ్ సాగర్ వర్గం,కొద్దిసేపు  కార్యాలయంలో తోపులాట, మాటల యుద్ధం జరిగింది.తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొనగా ఒకరినొకరు తీవ్రంగా దుర్భాశ లాడుకున్నారు.వినోద్ ను కాంగ్రెస్ కార్యాలయంలోకి రావద్దు అంటూ గొడవకు దిగారు.గత కొన్ని రోజులుగా,గడ్డం వినోద్,ప్రేమ్ సాగర్ ల మధ్య అంతర్గత విబేధాలు నడుస్తున్న నేపథ్యంలో కొత్త పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నిక అయ్యాక,గడ్డం వినోద్ బెల్లంపల్లిలో స్థిర పడడానికి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు, కాగా ప్రేమ్ సాగర్ రావు వర్గం గడ్డం వినోద్ పార్టీ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  చేపట్టకుండా అడ్డుకుంటన్నారు.గడ్డం వినోద్ సమావేశాలు పి ఏ రమేష్ ఆధ్వర్యంలో వారికి సన్నిహితులతో రడగంబాల బస్తీలోని  తన సొంత గృహంలో ఏర్పాటు చేసేవారు, ఇదే క్రమంలో  బుధవారం కాంగ్రెస్ కార్యాలయంలో గడ్డం వినోద్ అతని అనుచర వర్గం  అనధికారికంగా సమావేశం ఏర్పాటు చేయడంతో సమావేశంపై అభ్యతరం తెలిపి  పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయరాదని కార్యాలయం  నుండి వెళ్లి పోవాలని అడ్డుకున్నారు, బెల్లంపల్లిలో గ్రూపుల తగాదాలకు తెరలేపుతున్నారని ఆరోపిస్తు గొడవకు దిగారు.దీంతో వారితో  గడ్డం వినోద్, వాగిద్వధం కు దిగారు  కార్యాలయంలోఘర్షణ వాతావరణం నెలకొంది ,కొద్దిసేపటి తర్వాత  కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి,గడ్డం వినోద్ అతని వర్గం వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది.అదేవిధంగా ఐ ఎన్ టీ యు సి జనక్ ప్రసాద్ ను సైతం అనధికారికంగా సమావేశం నిర్వహించి నాయకులు,కార్యకర్తల మద్య సమన్వయం లోపించే విధంగా వ్యవహరించొద్దని జిల్లా నాయకుల ఆద్వర్యంలోనే అధికారిక సమావేశాలకు హజరుకావాలని చెప్పడంతో ఆయన కూడా ఏమి చేయలేక వెనుతిరిగారు.. బెల్లంపల్లి లో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గా  ప్రేమ్ సాగర్ వర్గం ను ఒకరిని గెలుపించుకోవడానికి, ఇప్పటినుండే సన్నాహాలు చేస్తున్నారు అని ఎవరికి వారే మేము అంటే మేమె ఎమ్మెల్యే అభ్యర్థి అని నాయకులు చర్చించుకుంటున్నారు,నాయకులు వారి వారి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు...

Related Posts