YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

 ప్రతి పాఠశాలలో పరిశుభ్రత పచ్చదనం కలిగి ఉండేవిధంగా చర్యలు చేపట్టాలి

 ప్రతి పాఠశాలలో పరిశుభ్రత పచ్చదనం కలిగి ఉండేవిధంగా చర్యలు చేపట్టాలి

 ప్రతి పాఠశాలలో పరిశుభ్రత పచ్చదనం కలిగి ఉండేవిధంగా చర్యలు చేపట్టాలి
కామారెడ్డి ఆగస్టు 25
కామారెడ్డి జిల్లాలోని  ప్రతి పాఠశాలలో పరిశుభ్రత, పచ్చదనం కలిగి ఉండే విధంగా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఆదేశించారు.బుధవారం నాడు దోమకొండ, బీబీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. దోమకొండ ప్రభుత్వ  పాఠశాలను పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలన్నారు. ప్రతి పాఠశాలకు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో 400 మొక్కలు  నాటే విధంగా చూడాలన్నారు. విద్యుత్తు, తాగునీరు సమస్యలు లేకుండా చూసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజనం  సంబంధించి సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పాఠశాలల్లో అపరిశుభ్రత వాతావరణం, శిధిలమైన నిర్మాణాలు లేకుండా చూడాలన్నారు. సెప్టెంబర్ 1న పండుగ వాతావరణంలో పాఠశాలలను పునః ప్రారంభించాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలు మాస్కులు ధరించి విధంగా చూడాలని కోరారు. విద్యార్థులు తరగతి గదుల్లో భౌతిక దూరం పాటిస్తూ కూర్చునే విధంగా          ప్రధానోపాధ్యాయులు చూడాలని కోరారు. దోమకొండ గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలన్నారు.
బీబీ పేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. 65 శాతం మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు వైద్య అధికారిని శ్వేత తెలిపారు. ఆస్పత్రి ఆవరణలో పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని కోరారు. జిల్లాలో 70 శాతం మంది పిల్లలకు నిమోనియా వ్యాధి రాకుండా నిరోధక టీకాలు వేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీడీవోలు దోమకొండ, బీబీ పేట చెన్నారెడ్డి,  నారాయణ, దోమకొండ సర్పంచ్ అంజలి శ్రీనివాస్, జెడ్ పి టి సి సభ్యుడు తిరుమల గౌడ్, ఎంపీవోలు, మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Posts