YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 సజ్జనార్ బదిలీ

 సజ్జనార్ బదిలీ

 సజ్జనార్ బదిలీ
హైదరాబాద్, ఆగస్టు 25,
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను బదిలీ చేసింది. ఆయనను టీఎస్ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సజ్జనార్ స్థానంలో కొత్త సీపీగా స్టీఫెన్ రవీంద్రను నియమించింది. 1999 బ్యాచ్‌కు చెందిన స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుతం వెస్ట్ జోన్ ఐజీపీగా బాధ్యతలు చేపడుతున్నారు.కాగా, 1996 బ్యాచ్‌కు చెందిన వీసీ సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా మూడేళ్ల పాటు సేవలు అందించారు. 2019వ సంవత్సరంలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిన విషయం తెలిసిందే. అలాగే 2008వ సంవత్సరంలో వరంగల్‌లో జరిగిన స్వప్నిక, ప్రణీత ఇన్సిడెంట్‌లో కూడా ఇదే విధంగా నిందితులను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సజ్జనార్ ఎన్‌కౌంటర్‌‌ చేశారు. అప్పట్లో అది ఒక సంచలనం.మరోవైపు మెదక్ సంఘటన గురించి ప్రస్తావిస్తే.. ఆ జిల్లాకు ఎస్పీగా సజ్జనార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగర్ B కు చెందిన గంజాయి స్మగ్లర్ బిక్యూ పవర్ అలియాస్ బిఖ్య నాయక్‌ను ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. అప్పట్లో బిఖ్య నాయక్, భార్య రుక్మబాయి గంజాయి ముఠాను పట్టుకొని రోడ్డు పక్కన ఉండడంతో .. కర్ణాటకలోని బార్డర్ క్రైమ్ మీటింగ్‌కు వెళ్తున్న సురేష్ అనే కానిస్టేబుల్ (30 మార్చి 2010) వాళ్ళను వెంబడించాడు. అయితే రుక్మ బాయి, బిఖ్య నాయక్‌లు కలసి కానిస్టేబుల్ సురేష్‌ను హత్య చేసి.. మహారాష్ట్ర పారిపోయారు. దీంతో పోలీసులకు బిఖ్య నాయక్‌కు పట్టుకోవాలంటే సవాలుగా మారింది. సుమారు నెల రోజులు అనగా 20 ఏప్రిల్ 2010 నాడు నిందితుడు బిఖ్య నాయక్‌ తిరిగి స్వగ్రామం వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తరుణంలో నాయక్ పోలీసులపై కాల్పులు జరపగా.. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపి బిఖ్య నాయక్‌‌ను కాల్చి చంపారు. ఇలా పలు ఎన్‌కౌంటర్లలో డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న సజ్జనార్.. కడప జిల్లాలో పులివెందుల ఏఎస్పీతో పాటుగా కూడా పని చేసిన సమయంలో కూడా ఎన్‌కౌంటర్లు చేశారు. ఇక సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెరగని ముద్ర వేశారు.

Related Posts