హైదరాబాద్ మెట్రోకు ఆర్థిక చేయూత
హైదరాబాద్
హైదరాబాద్ మెట్రో రైలుకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రా స్టక్చర్ర్ ఫండ్(ఎన్ఐఐఎఫ్ఎల్) సంస్థ చేయూతనిస్తోంది. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న హైదరాబాద్ మెట్రో రైలుకు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. రూ.4వేల కోట్ల పెట్టుబడికి ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. హైదరాబాద్ మెట్రో రైలు ఇప్పటికే రోజుకు రూ.5 కోట్ల చొప్పున నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా సాప్ట్ రుణాల కోసం హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ వివిధ బ్యాంకులను ఆశ్రయిస్తోంది.