2023లో అధికారం మాదే
హైదరాబాద్, ఆగస్టు 25,
హుజూరాబాద్‌లోనే కాదు 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు బీజేపీదే అన్నారు విజయశాంతి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సంబంధించిన ఆడియో సాంగ్స్‌ను విజయశాంతి విడుదల చేశారు. ఈనెల 28 నుండి చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త యాత్రకు బీజేపీ శ్రేణులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. అందుకే అందరికీ బంధుల పేరుతో ఏదేదో చేస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ చేపట్టే ప్రజా సంగ్రామ యాత్ర పాటలను విడుదల చేశారు విజయశాంతి.ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ… పాదయాత్ర పాటల లిరిక్స్ చాలా అద్బుతంగా ఉన్నాయన్నారు. గుండెను హత్తుకునేలా.. భావోద్వేగపూరితంగా పాటలున్నాయని అన్నాయి. తెలంగాణ మారమూల ప్రాంతాల ప్రజలను ఆకట్టుకోవడం ఖాయమన్నారు. పాటలు రాసిన వారందరికీ నా అభినందనలని తెలిపారు.బండి సంజయ్ చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం అవుతుందనే సంపూర్ణ నమ్మకం నాకుంది. ఈ యాత్రలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరుతున్నామని విజయశాంతి పిలుపునిచ్చారు. బీజేపీ క్రమశిక్షణ, సిద్దాంతాలున్న పార్టీ. కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ‘‘ హుజూరాబాద్ లో జరిగే ఉప ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు ఖాయమని.. బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని జోస్యం చెప్పారు విజయశాంతి.బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపి విజయశాంతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పాదయాత్ర కమిటీ ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధి ఎ. రాకేష్ రెడ్డి తదితరులు ఈ ఆడియో పాటలను విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 24 నుంచి యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ మరణం వల్ల వాయిదా పడింది.పార్టీ పరంగా 3 రోజుల పాటు సంతాపదినాలు పాటించాలని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈనేపథ్యంలో ఈనెల 28న ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి యాత్ర ప్రారంభం కానుంది.