బెల్టుషాపులు నిర్వహిస్తే కఠినచర్యలు తప్పవు
డీఎస్పీ వినోద్ కుమార్
అక్రమంగా మద్యం అమ్మితే జైలుశిక్ష తప్పదు
ఎస్ ఐ మన్మధ విజయ్
కౌతాళం
జిల్లా అధికారులు ఆదేశాలు మేరకు అనుమానిత వ్యక్తుల బెల్టుషాపులు నిర్వహిస్తున్న వారిపై నిఘా ఉంచామని డిఎస్పీ వినోద్ కుమార్, సీఐ పార్థసారథి స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ మన్మధ విజయ్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని తోవి మరియు బదినేహల్ గ్రామాలకు చెందిన 9 మంది వ్యక్తులు కర్ణాటక రాష్ట్ర చెల్లె కుడ్లుర్ చెందిన కల్లూరు సన్న అయ్యన్న అయ్యప్ప అను వ్యక్తి వద్ద ఒరిజినల్ ఛాయిస్ టెట్రా ప్యాకెట్లు 180 ఎంఎల్ మరియు 90 ml గలవి తక్కువ ధరకు కొని తెల్లటి ప్లాస్టిక్ సంచులో పెట్టుకొని ఉప్పారహల్ వైపు నుంచి మోటార్ వాహనాలు వస్తుండగా వెంటనే ఎస్ ఐ మన్మధ విజయ్ మరియు సిబ్బంది సహాయం తో వారిని చుట్టూ ముట్టి పట్టుకుని విచరించివారి వద్ద నుండి 26 బాక్సలు ఒరిజినల్ ఛాయిస్ 90 ఎంల్ 35 బాక్సలు ఒరిజినల్ ఛాయిస్ 180 ఎంల్ మొత్తం 61 బాక్సలు 4176 టెట్రా ప్యాకెట్లు 5 ద్విచక్ర వాహనాల ను 6 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయడమైనది అని డిఎస్పీ వినోద్ కుమార్ సిఐ పార్థసారథి పేర్కొన్నారు. అక్రమంగా మద్యం తరలించి గ్రామంలో అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్, జయరాం,హుస్సేన్ బాష, వలి పులిరాజు,పోలీస్ సిబ్బంది ఉన్నారు.