సేవే లక్ష్యంగా ముందుకెళ్తున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
ట్రస్ట్ సేవలు అభినందనీయం
మున్సిపల్ కమిషనర్ శ్యాo సుందర్ రావు
వేములవాడ
సేవ లక్ష్యంగా ముందుకెళ్తున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సేవ కార్యక్రమాలు చేయడం అభినందనియని మున్సిపల్ కమిషనర్ శ్యాo సుందర్ రావు అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న అన్నదాన కార్యక్రమం బుధవారం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. 100 మంది పేదలకు చీరలు,దోవతులు,సంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కరొనా కష్టకాలంలో ఎంతోమంది నిరుపేదలకు ఆకలి తీర్చిన ట్రస్ట్ ను అభినందిస్తూ ప్రతిరోజు పేదలకు అన్నదానమే కాకుండా ఆపదలో ఉన్న వారికి సైతం ఆర్థిక సహాయం చేయడం గొప్ప విషయమని అన్నారు . మునుముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని కమిషనర్ సూచించారు . ట్రస్టు చైర్మన్ కుంట అనిల్ కుమార్ మాట్లాడుతూచిన్న ప్రయత్నంగా ప్రారంభించిన మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఎంతో మందికి కడుపు నిండా భోజనము అందించడం చాలా ఆనందంగా ఉందని,మా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. త్వరలో ట్రస్ట్ ద్వారా ఆపదలో ఉన్న వారికి అంబులెన్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ట్రస్ట్ కు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు . అనంతరం పేదలకు చీరలు, దోవతులు, సంచులను అందజేశారు. అంతకుముందు ట్రస్ట్ కోశాధికారి మధుమహేష్, ఉపాధ్యక్షుడు చందనం శ్రీకాంత్ ట్రస్టు పరిణామక్రమాన్ని, సేవా కార్యక్రమాలను వివరించారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ప్రముఖ వైద్యులు నల్ల దిలీప్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ విజృంభణ కాలంలోనూ ధైర్యంగా సేవలందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ట్రస్టు సభ్యులను అభినందించారు. అనంతరం ట్రస్టు డైరెక్టర్లను చైర్మన్ అనిల్, మధు మహేష్ సన్మానించారు.