YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

ఫార్మాకు భారీగా పెట్టుబడులు

ఫార్మాకు భారీగా పెట్టుబడులు

ముంబై, ఆగస్టు 26, 
మెడిసిన్స్‌‌‌‌ తయారీలో కీలకమైనది యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్‌‌‌‌ (ఏపీఐ). కానీ,  దీన్ని తయారు చేసే కంపెనీలు గత పదేళ్ల పెద్దగా లాభపడలేదు.  పెట్టుబడులు ఎక్కువగా అవసరం ఉండడం, చైనీస్‌‌‌‌ కంపెనీలతో పోటీపడలేకపోవడంతో దేశ ఏపీఐ ఇండస్ట్రీ అనుకున్నంతగా ఎదగలేదు.   కరోనా తర్వాత ఈ పరిస్థితులతో మార్పు కనిపిస్తోంది.  కరోనా సంక్షోభం ముందు వరకు ఒకలా కనిపించిన ఏపీఐ ఇండస్ట్రీ, ఇప్పుడు కొత్తగా కనిపిస్తోంది. పెద్ద పెద్ద ప్రైవేట్‌‌‌‌ ఈక్విటీ (పీఈ) కంపెనీలు, వెంచర్ క్యాపిటలిస్ట్‌‌‌‌లు దేశంలోని  ఏపీఐ కంపెనీల వెనకపడుతున్నాయి. దీనికొక ఉదాహరణ కూడా ఉంది. ముంబైకి చెందిన ఓ ఏపీఐ తయారీ కంపెనీ, తమ బిజినెస్‌‌‌‌లో కొంత వాటాను అమ్మేందుకు  బయ్యర్ల కోసం వెతుకుతుండేది. తాజాగా ఈ కంపెనీ మొత్తాన్ని కొనేందుకు పీఈ  కంపెనీలు పోటీ పడడుతున్నాయి. ఈ కంపెనీని నడుపుతున్న ఫ్యామిలీ  మెంబర్స్‌‌‌‌ కూడా బిజినెస్‌‌‌‌ను అమ్మేయాలంటే ఇదే మంచి టైమ్ అని భావిస్తున్నారు. కరోనా సంక్షోభం తర్వాత దేశ ఏపీఐ ఇండస్ట్రీపై ఇన్వెస్టర్ల ఫోకస్‌‌‌‌ పెరిగిందని అంటున్నారు ఎనలిస్టులు. ఈ ఏడాదిలో సెకంట్‌‌‌‌ సైంటిఫిక్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ను గ్లోబల్‌‌‌‌ పీఈ కంపెనీ కార్లీల్‌‌‌‌ గ్రూప్ కొనుగోలు చేసింది. ఆర్‌‌‌‌‌‌‌‌ఏ కెమ్‌‌‌‌ ఫార్మా, జెసీఎల్‌‌‌‌  కెమికల్స్ కంపెనీలను అడ్వెంట్‌‌‌‌ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ కొనుగోలు చేయగా, అంజన్ డ్రగ్‌‌‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌ను పేగ్‌‌‌‌ కొనుగోలు చేసింది. మోర్ఫిన్ ల్యాబ్‌లో 10 శాతం పీఈ ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు.  ఇవి కేవలం గత కొన్ని నెలల్లో జరిగిన పెద్ద డీల్స్‌‌‌‌ మాత్రమే. కాగా, ఏపీఐ కంపెనీలు రా మెటీరియల్స్‌‌‌‌ను వాడుకొని మెడిసిన్‌‌‌‌లో కీలకమైన ఏపీఐని తయారు చేస్తాయి.  ఏపీఐని వాడుకొని డ్రగ్స్‌‌‌‌,మెడిసిన్‌‌‌‌ను ఫార్మా కంపెనీలు తయారు చేస్తాయి.పన్నెండళ్లలో ఏపీఐ ఇండస్ట్రీ పెద్దగా ఎదగలేదు. దేశ ఏపీఐ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగులపై వచ్చే రిటర్న్‌‌‌‌ (ఆర్‌‌‌‌‌‌‌‌ఓసీఈ) చాలా తక్కువగా ఉంటుందని  హెల్త్‌‌‌‌కేర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌పై ఎక్కువగా ఫోకస్‌‌‌‌ చేసే పీఈ కంపెనీ క్వాడ్రియా క్యాపిటల్ ఫౌండర్ అమిత్ వర్మ అన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం ఉండే ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌లోకి తామెందుకు ఎంటర్ అవ్వాలని ఇన్వెస్టర్లు అనుకునేవారని  చెప్పారు. దీనికి తోడు చైనీస్‌‌‌‌ ఏపీఐ కంపెనీల వలన ఇండియన్ ఏపీఐ కంపెనీలు పెద్దగా పాపులర్ అయ్యేవి కావు. చైనీస్ కంపెనీలతో పోటీపడడానికి రేట్లను తగ్గిస్తే, కంపెనీల ప్రాఫిట్‌‌‌‌ మార్జిన్స్ తగ్గిపోయేవి అని అమిత్ పేర్కొన్నారు. కన్సల్టెన్సీ కంపెనీ పీడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం,  2020 నాటికి దేశంలో అవసరమయ్యే ఏపీఐ అవసరాల్లో 50 శాతం దిగుమతులపైనే ఆధారపడ్డాం. మిగిలిన 50 శాతాన్ని ఇండియన్ కంపెనీలు అందిస్తున్నా, ఏపీఐలను తయారు చేయడానికి రా మెటీరియల్స్ కోసం మళ్లీ చైనా వైపే చూస్తున్నాం. దీంతో అక్కడ రా మెటీరియల్‌‌‌‌ ఇండస్ట్రీ పెరుగుతోంది. చైనాలో స్పెషల్ ఎకనామిక్ జోన్‌‌‌‌లు మన దగ్గర ఉన్న వాటి కంటే  10–15 రెట్లు పెద్దగా ఉంటాయి.  దీంతో కంపెనీలు తమ క్యాపెక్స్లను తగ్గించుకోవడానికి వీలుంటుంది. అప్పులు కూడా 5–7 శాతం వడ్డీ వద్ద దొరుకుతాయి. అదే ఇండియాలో 11–14 శాతం చెల్లించాల్సి ఉంటోంది. మొత్తం ఖర్చుల్లో లాజిస్టిక్ ఖర్చులు చైనాలో 1 శాతాన్ని దాటటడం లేదు. ఇండియాలో3 శాతంగా ఉందని ఈ రిపోర్ట్ పేర్కొంది. దీనర్ధం గత పదేళ్ల నుంచి దేశ ఏపీఐ కంపెనీలు చైనీస్‌‌‌‌ కంపెనీలతో పోటీపడడంలో ఇబ్బంది పడుతున్నాయని. ఆర్చిడ్ ఫార్మా, స్టెర్లింగ్ బయోటెక్‌‌‌‌ వంటి కంపెనీలు దివాలా కోర్టుల వరకు వెళ్లడం తెలిసిందే. మరీ సడెన్‌‌‌‌గా ఏపీఐ ఇండస్ట్రీ మారడానికి కారణమేంటి? ఒకటే సమాధానం ‘కరోనా సంక్షోభం’. కరోనా వలన ఈ ఇండస్ట్రీవైపు ఇన్వెస్టర్లు చూడడం పెరిగింది. ‘కరోనా వలన మెడిసిన్స్ వాడకం పెరిగింది. దీంతో మొత్తం మార్కెట్‌‌‌‌ విస్తరిస్తోంది’ అని క్వాడ్రియా క్వాపిటల్‌‌‌‌ ఫౌండర్ అమిత్ వర్మ అన్నారు.  దీనికి తోడు ఎటువంటి జియోపొలిటికల్‌‌‌‌ సమస్యలు లేని ప్లేస్‌‌‌‌లకు సప్లయ్ చెయిన్‌‌‌‌ను షిఫ్ట్‌‌‌‌ చేసుకోవాలని కంపెనీలు చూస్తున్నాయి.  చాలా కంపెనీలు తమ బిజినెస్‌‌‌‌లలో కొంత భాగాన్ని చైనా నుంచి ఇండియాకు షిఫ్ట్ చేస్తున్నాయి. ఏపీఐ ఇండస్ట్రీపై ఫోకస్ పెరగడానికి ఇదొక కారణం. ఎన్విరాన్‌‌‌‌మెంట్‌‌‌‌ రూల్స్‌‌‌‌ను చైనీస్ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తుండడంతో కూడా ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు చైనా కంటే ఇండియాలోకి వస్తున్నాయి.  2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశ డ్రగ్‌‌‌‌, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ 18 శాతం పెరిగి 24 బిలియన్ డాలర్లకు (ఎక్స్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌) చేరుకుంది. ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ 2024 నాటికి 65 బిలియన్ డాలర్లకు, 2030 నాటికి 120 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. పెరుగుతున్న ఏపీఐ ఇండస్ట్రీపై పీఈ కంపెనీలు కన్నేశాయని అమిత్ అన్నారు. గత  ఏడాది కాలంలో దేశ ఫార్మా ఇండస్ట్రీలోకి 1.5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు వచ్చాయని పేర్కొన్నారు. పీఈ, వెంచర్ క్యాపిటలిస్ట్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు ఐదు రెట్లు పెరిగాయని చెప్పారు. సాధారణంగా పీఈ ఇన్వెస్టర్లు  ఎంటర్ అయిన తర్వాత ఐదు–ఏడేళ్ల వరకు ఉండి, తర్వాత తమ వాటాలను అమ్మేసుకుంటారు. కొన్ని ఏపీఐ కంపెనీల వాల్యుయేషన్ ఎక్కువగా ఉన్నా, ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. మైక్రోఫైనాన్స్‌‌‌‌, బిజినెస్‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌ అవుట్ సోర్సింగ్‌‌‌‌ (బీపీఓ), గోల్డ్ లోన్స్‌‌‌‌ వంటి సెక్టార్లు ఒకప్పుడు పీఈ కంపెనీలకు ఫేవరేట్‌‌‌‌గా కనిపించాయి. ఏపీఐ ఇండస్ట్రీలో కూడా అదే ట్రెండ్‌‌‌‌ కనిపిస్తోందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. హికల్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌, ఆర్తి డ్రగ్స్‌‌‌‌, సోలరా యాక్టివ్ ఫార్మా సైన్స్‌‌‌‌ షేర్లు కిందటేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఐదు–ఏడు రెట్ల వరకు పెరిగాయి. అతిపెద్ద ఏపీఐ మాన్యుఫాక్చరర్‌‌‌‌‌‌‌‌ దివీస్ ల్యాబ్స్ కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.  ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎల్‌‌‌‌ఐ స్కీమ్‌‌‌‌ కూడా ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను ఆకర్షించడంలో సాయపడుతోంది. ఫార్మా సెక్టార్లో పీఎల్‌‌‌‌ఐ కింద ఇన్వెస్ట్ చేసేందుకు మొత్తం 46 అప్లికేషన్లు వచ్చాయి. ఈ కంపెనీలు సుమారు రూ. 5,355 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నాయి.

Related Posts