YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పార్టీ పదవుల కోసం ప్రయత్నాలు..

పార్టీ పదవుల కోసం  ప్రయత్నాలు..

జామాబాద్, ఆగస్టు 26, 
తెలంగాణ రాష్ట్ర సమితిలో పదవుల కోసం రంగం సిద్దం అవుతుంది. వచ్చే నెలలో పార్టీ ప్లీనరీ నాటికి జిల్లా అధ్యక్ష పదవులను భర్తీ చేయాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించడంతో చాలా మంది నేతలు పార్టీ పదవులను దక్కించుకునే ప్రయత్నాలు షురూ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో పార్టీ పదవులకు ఎమ్మెల్యేల కారణంగా మంగళం పాడిన విషయం తెల్సిందే. ప్రస్తుతం పార్టీ పదవులన్ని ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఉన్నాయి. జిల్లా పదవులు అనేవి ఉన్నా లేని కిందికే లెక్కగా మారింది. నియోజకవర్గ ఇంచార్జి పదవులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల చెంతనే ఉన్నాయి. నగర, పట్టణ కమిటీలు ఉంటే అవి ఎమ్మెల్యేలు చెప్పిన వారికే వారి అనుచరులకే ఉండడంతో అవి ఉన్నా లేని కిందికే లెక్కగా మారాయి.నిజామాబాద్‌కు ప్రస్తుతం ఈగ గంగారెడ్డి, కామారెడ్డికి ముజిబొద్దీన్‌లు అధ్యక్షులుగా ఉన్నారు. వారే చివరి దఫాగా పదవుల్లో కొనసాగుతున్నారు. పార్టీ పరంగా వారు పదవులు అనుభవిస్తున్నా ఎక్కడా కూడా అధికారికంగా మాత్రం ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల చెప్పు చేతుల్లోనే మేయర్, నూడా, మున్సిపల్ చైర్మన్ పదవులు, మార్కెట్ కమిటీ పదవులు ఉండడంతో ప్రస్తుతం టీఆర్ఎస్‌‌లో ఎమ్మెల్యేలు సుప్రీం బాస్‌లుగా కొనసాగుతున్నారు. ఢిల్లీ స్థాయిలో ఎంపీలుగా ఉన్న వారు కూడా ఎమ్మెల్యేలు చెప్పినట్లే నడుచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్సీలుగా ఉన్న వారు సొంత నియోజకవర్గం అంటూ లేక ఎమ్మెల్యేల దయాదాక్షిణ్యాల పైనే తమ రాజకీయ జీవితాలను గడుపుతున్నారు. ఇప్పటి వరకు పార్టీ పదవుల్లో ఉన్న వారు ఎమ్మెల్యే చెబితేనే విలేకరుల సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.ఇటీవల టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించిన పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఉన్నఫళంగా పార్టీలకు జిల్లా అధ్యక్షులను నియామకాలు జరగాలని ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ప్లీనరీ నాటికి కార్యవర్గ కూర్పు బాధ్యతలను అప్పగించడంతో కొత్త జిల్లా నేతల ఎంపిక పార్టీ నాయకులపై పడింది. ఇప్పటి వరకు లేని పదవులలో నియామకాలు జరుగుతుండడంతో ఎమ్మెల్యేలను సమన్వయం చేసే బాధ్యతలను స్థానిక మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. కొత్తగా జిల్లా, నగర, పట్టణ కమిటీలు ఏర్పడుతున్న నేపథ్యంలో తమ అనుచరులకు తాము చెప్పిన వారికే ఇవ్వాలని ఎమ్మెల్యేల పేచి మొదలైంది.పార్టీలోనూ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు కొత్త కమిటీ నియామకాలు చేసేందుకు తమ కుటుంబ సభ్యులు, అనుచరులకు అందులో స్థానం ఉండాలని పట్టుబడుతున్నారు. ఇప్పటి వరకు వివిధ కార్పొరేషన్, జిల్లా పదవులు ఆశించి భంగపడ్డ సీనియర్లు మరోసారి పార్టీ పదవులను దక్కించుకునేందుకు చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా పార్టీ పదవులను దక్కించుకుని ఎన్నికలలో తమ ప్రాధాన్యత ఉంటుందని చూపించుకునే పనిలో పడ్డట్లు సమాచారం. ఇప్పటికే కొందరు తమకు ఎమ్మెల్సీ, కార్పొరేట్ చైర్మన్ల పదవులు దక్కకపోయిన పర్వలేదు కానీ పార్టీ పదవులు తమకే ఇవ్వాలని పార్టీ అధినేత కేసీఆర్ చెంతకు పదవుల పంచాయితీని తీసుకెళ్లినట్లు పార్టీలో చర్చ జరుగుతుంది.

Related Posts