కాకినాడ
సముద్రం ముందుకు చొచ్చుకురావడం మనం తరచూ చూస్తుంటాం. కానీ అదే సముద్రం 2 కిలోమిటర్లు వెనక్కి పోవడం విచిత్రమే. ఇది అంతర్వేదిలో సంగమంలో జరిగింది. బంగాళాఖాతంలో గోదావరి నది కలిసే సంగమ ప్రదేశం, అంతర్వేది. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం లో ఉన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. స్వామి దర్శనానికి నిత్యం పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. గత కొద్ది రోజులుగా అంతర్వేది వద్ద సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది. ఉవ్వెత్తున ఎగసిప డుతున్న అలలు ప్రజలను భయపెడు తున్నాయి.కానీ, ఇపుడు సముద్ర తీరంలో వింత పరిస్థితి నెలకొంది. నిన్న అలలు పోటెత్తి సాగరం ముందుకు చొచ్చుకుని రాగా, కొద్దిసేపటి క్రితం ఉన్నట్టుండి రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయింది. తూర్పు తీరంలో సాగరుడు భయపెడుతు న్నాడు. కొన్ని చోట్ల ముందుకు, మరికొన్నిచోట్ల వెనక్కు.. అది కూడా కూతవేటు దూరంలోనే కిలోమీటర్ల మేర భిన్నమైన మార్పులు వస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.