విశాఖపట్నం
మన భాష కోసం మనం పోరాటం చేయ్వల్సిన దుస్థితి వచ్చిందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. వైసీపీ టిడిపి రెండు పార్టీలు తెలుగు కు తెగులు పుట్టించారు. ఆంగ్ల మాద్యమం మీద వ్యామోహం తో రెండు పార్టీలు తెలుగు నిర్వీర్యం చేసారు. అంగన్ వాడిలో సైతం ఇంగ్లీషు పాఠాలు చేపుతున్నారు మాతృభాష కు మనుగడ లేకుండా చేసేందుకు వైసీపీ కుట్ర చేస్తుంది. మాతృభాష మీద అవగాహన లేని నాయకులు పాలకులుగా ఉండటం మన దౌర్భాగ్యం. ఈ నెల 29 నుండి సెప్టెంబర్ 4 వరకు తెలుగు భాష వారోత్సవాలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ వారోత్సవాల చేస్తున్నాము. ఈ నెల 31 న డిఎన్టి డే గా అనకాపల్లి లో నిర్వహిస్తున్నామని అన్నారు.