YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు

సంచలనం రేపిన 2017 డ్రగ్స్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. గతంలో ఈ కేసు విషయంలో  పలువురు విదేశీయులను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసారు. డ్రగ్స్ కింగ్ పిన్ కెల్విన్, మైక్ కమింగా, విక్టర్ లాంటి సూత్రధారులను అరెస్టు చేయడంతో టాలీవుడ్ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. వీళ్లంతా విదేశాలకు సంబంధించిన పౌరులు. గోవా డ్రగ్ మాఫియాతో వీరందరికీ సత్సంబంధాలు వున్నట్లు గుర్తించారు. సౌతిండియాలోని సినిమా తారలు, ఐటీ కంపెనీలో ఉద్యోగులు, స్కూలు, కాలేజీ పిల్లలు కేంద్రంగా గా డ్రగ్ మాఫియా నడిచింది. ఎం డి పి ఎస్ యాక్ట్ ప్రకారం డ్రగ్స్ నివారణ కోసం  అనే కాకుండా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కాకుండా అన్ని దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ అవ్వచ్చు. కానీ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కేవలం రాష్ట్ర పరిధిలో ఉన్న ఎక్సైజ్ శాఖ, సిట్ దర్యాప్తు లకే పరిమితం చేయడంతో హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేసారు. విదేశీయులు గా ఉన్న పౌరులు నిందితులుగా ఉండడంతో మనీలాండరింగ్ పెద్ద ఎత్తున జరిగి ఉండొచ్చని ఆరోపణలు వచ్చాయి. విదేశాలలో తయారవుతున్న డ్రగ్స్ కు కింగ్ పిన్ లు హైదరాబాద్ లో మకాం వేసారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఈడీ, సెంట్రల్ ఎకానామిక్స్ ఇంటలిజెన్స్ బ్యూరో  తో దర్యాప్తు చేయించాలని కోర్ట్ లో పిటిషన్లు దాఖలయ్యాయి. 2020  నవంబర్ ఎక్సైజ్ కమిషనర్ కు సమాచారం ఇవ్వాలనిఈడి లేఖ రాసింది. ఈడీ డెప్యూటీ డైరెక్టర్ రాహుల్ సింఘానియా కోర్ట్ లో అఫిడవిట్ దాఖలు చేశారు.  2017 లో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన 12 ఎఫ్ ఐ ఆర్ లు, చార్జిషీట్ లు ఇవ్వాలని ఎక్సైజ్ కమిషనర్ కు లేఖ రాసింది. ఎక్సైజ్ శాఖ నుండి ఎలాంటి సమాచారం రాలేదని గతంలో కోర్టుకు తెలిపింది. ఎక్సైజ్ శాఖ సేకరించిన  స్టేట్మెంట్లు, డిజిటల్ పరికరాలు సాక్షాలు రిపోర్ట్ కాపీలు ఇవ్వాలని గతంలోనే హైకోర్టును కోరింది. ఎక్సైజ్ శాఖ నుండి కేసుకు సంబంధించిన వివరాలు వీడికి అందటంతో ఈడి రంగంలోకి దిగింది. 

Related Posts