YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ
గిద్దలూరు
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ,ఐ. ఏ. హెచ్. వి ఆధ్వర్యంలో గిద్దలూరు లోని కాశిరెడ్డి నాయన కుంట ఆవరణంలో ఉన్న రామకృష్ణ మఠమునందు జనహిత కార్యకర్తలకు ఎన్ 95 మాస్కులు పంపిణీ చేశామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ .ఐ. ఏ. హెచ్. వి వారు ఖరీదైన మాస్కులు పంపిణీ చేయడం  అభినందించదగ్గ విషయం అన్నారు. శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ సేవలు అజరామరం అన్నారు. గతంలో కూడా 3 కాన్సన్ట్రేటర్స్ గిద్దలూరు ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రికి అందించామని గుర్తుచేశారు. కరోనా బారినపడకుండా ఉండటానికి విలువైన మాస్కులు అందించిన  బి యస్ నారాయణరెడ్డి కి అభినందనలు తెలిపారు. జనహిత కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బయటికి వచ్చే సమయంలో మాస్కు తప్పకుండా ధరించాలి అన్నారు. పని లేకుండా బయటికి వచ్చి షికార్లు చేయవద్దన్నారు. అలాగే మీ, మీ గ్రామాలలో ప్రతి ఒక్కరికి కోవిడ్ 19 మీద అవగాహన కల్పించాలని జనహిత కార్యకర్తకు సూచించారు. సమాజంలో కరోనా ఉద్ధృతంగా లేకపోయినా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం మంచిది కాదన్నారు. వ్యక్తిగతంగా మనం ఇబ్బందిపడుతూ ఇతరులను ఇబ్బందిపెట్టే రోజు తెచ్చుకోవద్దు అన్నారు. ప్రతిరోజు ఉదయం ఒక గంటసేపు  శరీరానికి వ్యాయామం చేయడం మంచిదన్నారు. అలా చేసినప్పుడు శరీరములో వేడిపెరిగి చెడుమలినాలు చెమటరూపంలో బయటికిపోతాయన్నారు.  ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుకోడానికి దీర్ఘమైన శ్వాసలు  ఉదయకాల సమయంలో బాగా గాలి పీల్చాలన్నారు. "మాస్కు ధరించండి --కరోనాను అరికట్టండి"
"మాస్కులు ధరించండి --కుటుంబాలను రక్షించండి"
"మాస్కు పెట్టుకుందాం-- భారత దేశాన్ని కాపాడుకుందాం" అని నినాదాలు చేయించారు. జనహిత కార్యకర్తలుచేత ఈ కార్యక్రమంలో   విశ్రాంత జిల్లా సర్వేయర్ రెడ్డి మల్లారెడ్డి,  డివిజనల్ జనహిత అధ్యక్షులు వి. వి. రామిరెడ్డి, పాండు, గిద్దలూరు వి హెచ్ పి మండల అధ్యక్షులు విశ్రాంత తెలుగు పండిట్ రామిరెడ్డి,  ఆర్ట్ ఆఫ్ లివింగ్ యువాచార్య గొంటు నాగార్జునరెడ్డి, జి పుల్లయ్య మాతాజీ లు  తదితరులు పాల్గొన్నారు.

Related Posts