యమపాశంలా మారిన రహదారులు..రోడ్లపై అప్రమత్తం కకాపోతే ప్రమాదమే..
అధ్వానంగా కుక్కునూరు - బూర్గంపాడు మార్గం..
రూపుమారిన తారు రోడ్డు.. ఆద్యంతం గతుకులు..
అధికారులకు పట్టని వాహన చోదకులు, ప్రయాణీకుల కష్టాలు..
కుక్కునూరు, ఆగస్టు 26
పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండల పరిధిలోని గోతులు పడ్డా రహదారులతో అనేక మంది వాహనదారులు మరియు ప్రయాణీకులు పలు ఇబ్బందులు పడుతున్నారు. కుక్కునూరు నుండి బూర్గంపాడు వెళ్లి రహదారి రూపుమారిపోయింది. తారు రోడ్డు ఆనవాళ్లు కోల్పోయి మట్టి మార్గాన్ని తలపిస్తోంది. ఆద్యంతం గతుకులు పడి అస్తవ్యస్తంగా తయారైంది. వర్షం పడితే గోతుల్లో నీరు చేరి ఛిద్రమవుతోంది. ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో వాహన చోదకులు ప్రత్యక్ష నరకం చవిచూడాల్సి వస్తోంది. రహదారి
గోతులమయంగా మారటంతో ఈ రహదారి పై ప్రయాణం కొనసాగించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందని వాహనాలపై ప్రయాణించే ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కుకునూరు మండల కేంద్రం నుండి అశ్వారావుపేట వెళ్లే దారిలో పెట్రోల్ బంకు దగ్గర రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో పాటుగా, కుక్కునూరు మండల కేంద్రం నుండి బూర్గంపాడు వరకు ప్రధాన రహదారి గుంతలమయం అవడంతో మండలంలో గిరిజన గ్రామాలు కలుపుకొని వెళ్లే ఈ రహదారిపై, రేయింబవళ్లు ప్రజలు, రైతులు, వాహన చోదకులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు.
కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ప్రజలు భద్రాచలం, పాల్వంచలకు వెళ్లాలంటే ఈ రహదారే ఆధారం. కుక్కునూరు నుండి ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన వేలేరు గ్రామం వరకు ప్రజలు నిత్యం ఈ రోడ్డునే ఆయా గ్రామాల ప్రజలు ఎక్కువగా వినియోగిస్తుంటారు. రోడ్లపై గుంతలు ఏర్పడక ముందు కుక్కునూరు నుండి భద్రాచలం వెళ్ళడానికి గంటన్నర సమయం పట్టెదని రోడ్లపై గుంతలు ఏర్పడం వల్ల సుమారు రెండున్నర గంటల సమయం పడుతుందని వ్యయప్రయాసాలు తప్పడంలేదు. దీంతో ద్విచక్ర వాహనదారులు, కార్లు, ట్రాక్టర్లు, ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తాయి. నిత్యం జామాయిల్ కర్ర అధిక లోడుతో వస్తున్న ట్రాక్టర్లు కూడా ఈ రోడ్డు మీదుగానే వెళ్తుంటాయి. ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైనా వేలేరు చెక్పోస్టుకు దగ్గర తారు రోడ్డుపై ఏర్పడిన గుంతలో జామాయిల్ కర్ర లోడ్ ట్రాక్టర్ దిగుబడి సుమారుగా 2 - 3 గంటల వరకు నడిరోడ్డుపై జామాయిల్ లోడ్ ట్రాక్టర్ గుంత నుండి బయటకు రాకపోవడంతోనే తారు రోడ్డుపై గుంతలు ఏర్పడి ఎంత అద్వానంగా తయారైందనేది తెలుస్తుందని, జంగారెడ్డిగూడెం, రాజమండ్రి వెళ్లే బస్సులు,కార్లు,లారీలు, రైతులు మోటర్ సైకిళ్లు మరియు ఇతర వాహనాలపై నిత్యం ఇదే రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు. ఇంత ప్రాధాన్యం కలిగిన ఈ రహదారి రూపుమారిపోయి అధ్వానంగా తయారైంది. ఆద్యంతం గతుకులు పడి తారురోడ్డు ఆనవాళ్లు కోల్పోయింది. ఏమాత్రం వర్షం కురిసినా గతుకుల్లో నీరు చేరి చెరువులను తలపిస్తోంది. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు, రైతులు, వాహన చోదకులు ప్రయాణికులు రాకపోకలకు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఎక్కడ గొయ్యి ఉందో తెలియక వాహనాలపై ప్రయాణించే ప్రయాణీకులకు తరచూ పెను ప్రమాదాలు సంబవించే పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, దీనికి తోడూ గుంతలు పడిన రోడ్లపై వాహనాలు తిరగడం వల్ల వాహనదారుడి జేబుకు చిల్లు పడుతుందని,గుంతలు పడిన రోడ్లమీద వాహనాలపై ప్రయాణిస్తే వాహనాలు గుళ్ళ అయి మెకానిక్ల జేబులను కాసులతో నింపుతున్నాయని, కురుస్తున్న వర్షాలకు రోడ్ల పై ఉన్న గుంతలలోకి నీరు చేరడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైన గుంతలలోకి నీరు చేరడంతో రోజు నానా అవస్థలు పడుతూ బిక్కూ-బిక్కూ మంటూ ప్రయాణిస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రాత్రుళ్లు బైకులపై ప్రయాణించేటప్పుడు గోతుల్లో పడి ప్రమాదాలు జరుగుతున్నయని, ఇవి రహదారుల్లా లేవని గుంతలు పడి రోడ్లు యమపాశంలా ఉన్నాయని, రాత్రి సమయాల్లో ఈ మార్గంలో ప్రయాణించక పోవడమే ఉత్తమమని వాహన చోదకులు, ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ రహదారికి తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని వారు వేడుకుంటున్నారు.