పేద విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు
పేద విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా నాడు నేడు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు . నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్, పొదలకూరు రోడ్డు లోని జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 52 లక్షల రూపాయల వ్యయంతో పూర్తైన మనబడి నాడు - నేడు బిల్డింగ్ ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థినీ, విద్యార్థులందరికి ఉన్నత విద్యను అందించాలన్న సమున్నత లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మనబడి నాడు-నేడు అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.నాడు-నేడు తో మార్పు సాధ్యమా అన్న సందేహం తొలుత ప్రతి ఒక్కరిలో ఉండేదన్నారు. అసాద్యాన్ని సుసాధ్యం చేసి, దేశచరిత్రలో పేద విద్యార్థులు చదువుకోవాలి అనే సంకల్పంతో అమ్మఒడి అనే పధకం ఏర్పాటుచేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు.ప్రతిఒక్క విద్యార్ధి చదువుకోవాలనే దృఢ సంకల్పంతో అనేక పధకాలను ప్రవేశపెడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజలందరి అశీసులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ , సీనియర్ రాజకీయ నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, విద్యాశాఖాధికారి రమేష్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ యేసు నాయుడు, 29వ డివిజన్ ఇంఛార్జ్ చెక్కా సాయి సునీల్, విద్యాకమిటీ ఛైర్మెన్ రాధ, వైసీపీ నాయకులు తోట శోభారాణి, హజరత్ నాయుడు, తోట దామోదర్, మేఘనాధ్ సింగ్, నీళ్ల పెంచలమ్మ, తుమ్మల శ్రీనివాసులు, శ్రీనివాసులు గౌడ్, అరుణమ్మ, జి. సురేష్ రెడ్డి, బి. సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.