YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

 శ్రీశైల దేవస్థానం లో ఉద్యోగులతో ఈవో కె.ఎస్.రామారావు సమావేశం

 శ్రీశైల దేవస్థానం లో ఉద్యోగులతో ఈవో కె.ఎస్.రామారావు సమావేశం

 శ్రీశైల దేవస్థానం లో ఉద్యోగులతో ఈవో కె.ఎస్.రామారావు సమావేశం
శ్రీశైల దేవస్థానం లో దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న కె.ఎస్. రామరావుగారు ఈ రోజు  దేవస్థానం ఉద్యోగులతో సమావేశమయ్యారు.
దేవస్థాన పరిపాలనాభవనములో జరిగిన ఈ సమావేశానికి అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, వివిధ విభాగాల సిబ్బంది మరియు అర్చకస్వాములు, వేదపండితులు. హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల కాలములో దేవస్థానం సిబ్బంది అందరు తమకు ఎంతగానో సహకరించారని చెబుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. విధినిర్వహణలో తమకు సహకరించినట్లుగానే రాబోవు నూతన కార్యనిర్వహణాధికారివారికి కూడా సహకరించి ఉద్యోగలందరు కూడా దేవస్థానం అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
గత రెండు సంవత్సరాల కాలములో దేవస్థానములో పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టబడి విజయవంతం అవ్వడములో దేవస్థానములోని ఉద్యోగులందరు కూడా ఎంతగానో ఉందన్నారు. లోకకల్యాణం కోసం ముఖ్యంగా కరోనా వ్యాప్తి అరికట్టబడి జనులందరు కూడా ఆరోగ్యాన్ని పొంది, సుంఖసంతోషాలతో ఉండాలన్న సంకల్పముతో 41 రోజుల పాటు మహామృత్యుంజయ పాశుపతహోమం, 21 రోజులపాటు సీతలాదేవి హోమాలు జరిపించడం జరిగిందన్నారు. కరోనా వ్యాప్తి సమయములో కూడా అర్చకస్వాములు, ఉద్యోగులు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా శ్రీశైల క్షేత్రపరిధిలో కరోనా వ్యాప్తి నివారించడంలో కూడా ఉద్యోగులు తమవంతు పాత్రను పోషించారన్నారు.
అలాగే శ్రీశైలానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు తమ గోత్రనామాలతో ఆయా సేవలను పరోక్షంగా జరిపించుకునేందుకు వీలుగా శ్రీశైలపరోక్షసేవను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పరోక్షసేవకు భక్తుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడం ఎంతో ఆనందాన్ని
కలిగిస్తుందన్నారు. ఇంకా వారు మాట్లాడుతూ ఆలయ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా ఆలయంలోకి ప్రవేశించే వారంతా విభూతిని ధరించే విభూతిధారణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఆలయాన్ని దర్శించే భక్తులందరికి కూడా శ్రీస్వామివార్ల ప్రసాదం అందించాలనే సంకల్పముతో నిరంతర ప్రసాదవితరణను చేపట్టడం జరిగిందన్నారు.
శ్రీశైల సంస్కృతి సంప్రదాయాలతో చెంచుభక్తులకు గల స్థానాన్నిమరియుహిందూ ధర్మ ప్రచారంలో భాగంగా చూడాలలో ధర్మప్రచార కార్యక్రమ నిర్వహణకుగాను. ' మా స్వామి.. మల్లన్న' కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అదేవిధంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో బ్రహ్మోత్సవ కల్యాణానికి చెంచు భక్తులను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగిందన్నారు. వైదిక సంస్కృతి సంప్రదాయాలలో గోవుకు గల విశిష్టస్థానాన్ని గురించి అందరికీ అవగాహన కల్పించాలనే భావనతో గో ఉత్పత్తుల తయారీ మరియు విక్రయాలను ప్రారంభించడం జరిగిందన్నారు. శ్రీస్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్ని పరిపూర్ణంగా జరిపించేందుకు నిత్యకళారాధన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
ఇక స్థానికులు మరియు యాత్రికుల సౌకర్యార్థం నిరంతర వైద్యసేవలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. గతంలో రోజుకు 8గంటలు మాత్రమే దేవస్థాన వైద్యశాలలో అందించబడుతుండేవని, అయితే నిరంతర వైద్యసేవల విధానములో 24 గంటలపాటు వైద్యసేవలు అందే సదుపాయం కల్పించడం జరిగిందన్నారు.
సనాతన సంస్కృతి పరిరక్షణలో భాగంగా శ్రీశైలక్షేత్రములో మొట్టమొదటిసారిగా వేదసభను నిర్వహించడం జరిగిందన్నారు. దసరా మహోత్సవాలలోనూ, సంక్రాంతి బ్రహ్మోత్సవాలలోనూ ఈ వేదసభ నిర్వహించబడిందన్నారు.అదేవిధంగా భక్తులలో దేవతా వృక్షాలపై అవగాహన కల్పించేందుకు నక్షత్రవనం పనులు ప్రారంభించబడ్డాయన్నారు. సనాతన సంస్కృతి పరిరక్షణలో భాగంగానే రథసప్తమి రోజున సూర్యనమస్కార కార్యక్రమం
జరిపించడం జరిగిందన్నారు.ఇంకా శ్రీశైలమహాక్షేత్ర పరిధిలో వివాహం చేసుకుని, పెళ్ళి దుస్తులతో ఆలయానికి విచ్చేసిన నూతన వధూవరులను దేవస్థానం తరుపున ఉచితంగా ఆశీర్వదించేందుకు సౌభాగ్యమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
శ్రీశైలక్షేత్ర చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణలో భాగంగా పంచమఠాల పునరుద్ధరణను వేగవంతం చేయడం జరిగిందన్నారు.ఘంటామఠ పునర్నిర్మాణ పనులలో 53 ప్రాచీన తావుశాసనాలు లభించడం ఎంతో విశేషమన్నారు.
అదేవిధంగా శ్రీశైలక్షేత్రములో ప్రాచీన చిత్రలిపిని గుర్తించడం జరిగిందన్నారు.ఆలయాన్ని దర్శించే భక్తులందరికి కూడా శ్రీస్వామివార్ల ప్రసాదం అందించాలనే సంకల్పముతో నిరంతర ప్రసాదవితరణను చేపట్టడం జరిగిందన్నారు. శ్రీశైల సంస్కృతి సంప్రదాయాలతో చెంచుభక్తులకు గల స్థానాన్నిమరియుహిందూ ధర్మ ప్రచారంలో భాగంగా చూడాలలో ధర్మప్రచార కార్యక్రమ నిర్వహణకుగాను. ' మా స్వామి.. మల్లన్న' కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అదేవిధంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో బ్రహ్మోత్సవ కల్యాణానికి చెంచు భక్తులను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగిందన్నారు.
వైదిక సంస్కృతి సంప్రదాయాలలో గోవుకు గల విశిష్టస్థానాన్ని గురించి అందరికీ అవగాహన కల్పించాలనే భావనతో గో ఉత్పత్తుల తయారీ మరియు విక్రయాలను ప్రారంభించడం జరిగిందన్నారు. శ్రీస్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్ని పరిపూర్ణంగా జరిపించేందుకు నిత్యకళారాధన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
ఇక స్థానికులు మరియు యాత్రికుల సౌకర్యార్థం నిరంతర వైద్యసేవలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. గతంలో రోజుకు 8గంటలు మాత్రమే దేవస్థాన వైద్యశాలలో అందించబడుతుండేవని, అయితే నిరంతర వైద్యసేవల విధానములో 24 గంటలపాటు వైద్యసేవలు అందే సదుపాయం కల్పించడం జరిగిందన్నారు.
సనాతన సంస్కృతి పరిరక్షణలో భాగంగా శ్రీశైలక్షేత్రములో మొట్టమొదటిసారిగా వేదసభను నిర్వహించడం జరిగిందన్నారు. దసరా మహోత్సవాలలోనూ, సంక్రాంతి బ్రహ్మోత్సవాలలోనూ ఈ వేదసభ నిర్వహించబడిందన్నారు.అదేవిధంగా భక్తులలో దేవతా వృక్షాలపై అవగాహన కల్పించేందుకు నక్షత్రవనం పనులు ప్రారంభించబడ్డాయన్నారు.
సనాతన సంస్కృతి పరిరక్షణలో భాగంగానే రథసప్తమి రోజున సూర్యనమస్కార కార్యక్రమం
జరిపించడం జరిగిందన్నారు.ఇంకా శ్రీశైలమహాక్షేత్ర పరిధిలో వివాహం చేసుకుని, పెళ్ళి దుస్తులతో ఆలయానికి విచ్చేసిన నూతన వధూవరులను దేవస్థానం తరుపున ఉచితంగా ఆశీర్వదించేందుకు సౌభాగ్యమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
శ్రీశైలక్షేత్ర చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణలో భాగంగా పంచమఠాల పునరుద్ధరణను వేగవంతం చేయడం జరిగిందన్నారు.ఘంటామఠ పునర్నిర్మాణ పనులలో 53 ప్రాచీన తావుశాసనాలు లభించడం ఎంతో విశేషమన్నారు.
అదేవిధంగా శ్రీశైలక్షేత్రములో ప్రాచీన చిత్రలిపిని గుర్తించడం జరిగిందన్నారు

Related Posts