YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు  గురుకుల పాఠశాలను సిద్దం చేయాలి

ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు  గురుకుల పాఠశాలను సిద్దం చేయాలి

ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు  గురుకుల పాఠశాలను సిద్దం చేయాలి
- గురుకులాలో స్వచ్చమైన  త్రాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలి
- వ్యాధి లక్షణాలు ఉన్న విద్యార్థులకు వెంటనే  పరీక్షలు నిర్వహించాలి
- ప్రతి విద్యార్థి మాస్క్, శానిటైజర్ వినియోగించేలా చర్యలు
- సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టంగా పారిశుద్ద్య చర్యలు చేపట్టాలి
- జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి   ఆగస్ట్ 26
ప్రత్యక్ష తరగతులు  సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని గురుకుల  పాఠశాలలను  సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల ప్రారంభం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై  సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ గురువారం తన చాంబర్లో  రివ్యూ నిర్వహించారు. సెప్టెంబర్ 1వ తేది నుండి ప్రత్యక్ష బోధనా తరగతులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని సంక్షేమ, గురుకుల పాఠశాలలను, అన్ని రకాల రెసిడెన్షియల్  పాఠశాలలో అవసరమైన ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలల పరిసరాలు, తరగతి గదులు, వంట గదులు, మంచి నీటి ట్యాంకు లు పరిశుబ్రం చేయించాలని కలెక్టర్ సూచించారు. గ్రామ పరిధిలో అయితే పంచాయతి సిబ్బంది, మున్సిపలిటిలో అయితే మున్సిపల్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పకడ్భందిగా  పారిశుద్ద్య  కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి పాఠశాల తరగతి గదులు, పరిసరాల్లో సోడియం హైపోక్లోరైడ్ లేదా బ్లీచింగ్ చల్లించాలని సూచించారు. వీటికి తోడు మంచి నీటి నల్ల అనుసంధానం, విద్యుత్ సమస్యలు, లైట్లు తదితర చిన్న పాటి  రిపేర్లు ఉంటె అందుబాటులో ఉన్న నిధులతో వెంటనే మరమ్మతులు చేయించుకోవాలని సూచించారు. పాఠశాలలు ప్రారంభించే సమయానికి సర్వం సిద్ధం చేసి పిల్లలు వచ్చేటప్పుడు  మాస్క్ లు లేని వారికీ మాస్క్ లు అందింఛి తప్పని సరిగా ధరించే విధంగా చూడాలన్నారు.   సనిటైజర్లు అందుబాటులో ఉంచడం, సాధ్యమైనంత వరకు పిల్లలను దూరం పాటించే విధంగా చూడాలన్నారు. ఎవరికైనా జ్వరం, జలుబు లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకు వెళ్లి వైద్య పరిక్షలు చేయించాలన్నారు. లక్షణాలు ఉన్న వ్యక్తి ఎవరెవరితో కలిసి ఉన్నడో తెలుసుకొని వారందరికి కరోన పరిక్షలు చేయించాలని తెలియజేసారు. ప్రతి రోజు ప్రిసిపాల్ తమ జిల్లా అధికారికి కోవిడ్ నివేదిక అందజేయాలని తద్వారా అధికారులు తనకు రోజువారీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పాఠశాలల్లో  ఎక్కడ కోవిడ్ రాకుండా కోవిడ్ నిబంధనలు కటినగా అమలు చేయాలనీ ఆదేశించారు.   రెసిడెన్షియల్ పాఠశాలలు సైతం ప్రారంభిస్తున్న నేపథ్యంలో  పిల్లల తల్లితండ్రులకు నేరుగా ఫోన్ చేసి సమాచారం అందించాలని  కలెక్టర్  సూచించారు. మల్లెరియా, డెంగ్యూ వంటి  సీజనల్ వ్యాధులు ప్రబలకుండా  రెసిడెన్షియల్  పాఠశాల ఆవరణలో  పకడ్భందిగా పారిశుద్ద్య చర్యలు తీసుకోవాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలకు పౌష్టికరమైన, నాణ్యమైన ఆహారం అందించాలని, దీని కోసం వెంటనే పుడ్ కాంట్రాక్టర్ తో చర్చించాలని, వారు సిద్దంగా ఉంటే రెన్యూవల్  చేయాలని లేని పక్షంలో  వెంటనే  రిటెండర్  చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలో ప్రత్యేక్ష తరగతులు ప్రారంభమైన తరువాత జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, అలసత్వం ప్రదర్శిస్తే  కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేసారు. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి జగన్ మోహన్ రెడ్డి, పాఠశాలల సమన్వయకర్తలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గోన్నారు.

Related Posts