కలెక్టర్ చేతుల మీదుగా సేవా ప్రశంసా పత్రాన్ని అందుకున్న నిత్యవాణి పౌండేషన్
నెల్లూరు
నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు చేతుల మీదుగా నిత్య వాణి ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ మోహన్ సేవ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. గో ఎన్ జి ఓ కోఆర్డినేషన్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు లోని కస్తూరిబా కళా క్షేత్రం నందు నిత్య వాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న , సామాజిక, సాంసృతిక సేవల్ని గుర్తిస్తూ సేవా ప్రశంసా పత్రాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కరోనా సమయంలో కూడా స్వచ్చంధ సేవా సంస్థలు తమ సేవల్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.గణేష్ కుమార్, జిల్లా పంచాయితి ఆఫీసర్ ధనలక్ష్మీ, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి డి.పుల్లయ్య, నెహ్రూ యువకేంద్ర జిల్లా అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి తదితరులు పాల్గొని విజయ మోహన్ ను అభినందించారు.