YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సోషల్ మీడియాలో టీడీపీ దూకుడు

సోషల్ మీడియాలో టీడీపీ దూకుడు

గుంటూరు, ఆగస్టు 27, 
జగన్ బలవంతుడే. ప్రజాభిమానం నిండుగా ఉంది. ఆయన రాజకీయంగా చూస్తే ఇంకా యువకుడే. దాంతో పాటు పటిష్టమైన ఓటు బ్యాంక్ ఉంది. మరిన్ని సార్లు గెలిచే దమ్మూ ధైర్యం ఉన్నాయి. కానీ రాజకీయాలో ట్రెండ్ మారింది. టెక్నాలజీ బాగా పెరిగింది. దాంతో జనాలను ఆకట్టుకోవాలంటే ఇపుడు స్మార్ట్ ఫోన్లే అధారం. మరి జగన్ కూడా వాటి ద్వారానే అధికారంలోకి సులువుగా వచ్చేశారు. జగన్ విపక్షంలో ఉన్నపుడు సోషల్ మీడియా జై జగన్ అంటూ తెగ హోరు చేసేది. అన్న వస్తున్నాడు అంటూ వైసీపీ వాళ్ళు పోస్ట్ చేస్తే లైక్స్ లక్షల్లో వచ్చేవి. ఇక జగన్ ని పొగుడుతూ ఎన్నో పోస్టింగులు అలా రోజూ పెడుతూంటేవారు. ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని బాగా వాడుకుంటూ జగన్ హైప్ ని సోషల్ మీడియా జనాల్లో పెంచేసేవారు. మరిపుడు చూస్తే అంతా ఉల్టా సీదాగా సీన్ ఉంది.సోషల్ మీడియాలో ఇపుడు టీడీపీదే అధిపత్యంగా ఉంది. జగన్ని విమర్శిస్తూ తమ్ముళ్ళు అక్కడ రెచ్చిపోతున్నారు. ఏపీలో రెండున్నరేళ్ల పాలన మీద సోషల్ మీడియాలో చర్చ పెట్టి ఫ్యాన్ రెక్కలు విరగగొడుతున్నారు. అంతా అప్పుల మయం అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో ఒక్కరూ బతకలేరు అంటూ వేడి నిట్టూర్పులతో పెడుతున్న పోస్టింగులకు కనీసం కౌంటర్ ఇచ్చే నాధుడు వైసీపీ నుంచి కనిపించడంలేదు. ఒకనాడు జై జగన్ అంటూ హుషార్ చేసిన సోషల్ మీడియా గ్యాంగ్ ఏమైందో వైసీపీ పెద్దలే జవాబు చెప్పాలేమో. ఇక సోషల్ మీడియా అంటే తమ వారిని పెంచడం, ప్రత్యర్ధులను తుంచడం చేస్తారు. అక్కడ నిజాలు ఎవరికీ అవసరం లేదు, అందుకే నిజం నిలకడ మీద తెలిసేలోగానే అబద్ధం మొత్తం ప్రపంచం చుట్టేస్తోంది.జగన్ ని సీఎం సీట్లో కూర్చోబెట్టిన సోషల్ మీడియా మీద ఆ పార్టీ ఎందుకు చిన్న చూపు చూస్తుందో అర్ధం కావడం లేదు. టీడీపీ ఒక సైన్యం మాదిరిగా బాబుతోనే ఏపీ అభివృద్ధి అంటూ గత కొన్నాళ్ళుగా ఒక రకమైన ప్రచారం మొదలెట్టేసింది. నాడు రావాలి జగన్ కావాలి జగన్ అన్న స్లోగన్ లాంటిదే ఇపుడు టీడీపీ చేస్తోంది అక్కడ. నిరుద్యోగులకు జాబ్స్ రావాలన్నా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీకి జీతాలు రావాలన్నా ఏపీలో ప్రగతి కనిపించలన్నా, పరిశ్రమలు రావాలన్నా బాబు రావలసిందే అంటూ టీడీపీ పెడుతున్న సోషల్ మీడియా పోస్టింగులు తెగ హైలెట్ అవుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళు టైమ్ ఉన్నా కూడా టీడీపీ ఇప్పటి నుంచే దూకుడు చేస్తోంది. ఇలాగే ఈ స్పీడ్ సాగితే వైసీపీకి భారీ డ్యామేజ్ తప్పదని అంటున్నారు.సరిగ్గా టీడీపీ ఏ తప్పు చేస్తోందో వైసీపీ అదే చేస్తోంది అంటున్నారు. అధికారం మాయంలో పడి ఒక పార్టీగా వైసీపీ తనను తాను మరచిపోయింది. పార్టీ క్యాడర్ కి పదవులు కూడా ఇచ్చారు. దాంతో ఎవరి పనులలో వారు తెగ బిజీ అయిపోయారు. సంక్షేమ పధకాలే తను గట్టెక్కిస్తాయని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. కానీ ఆ పధకాలను కూడా ప్రచారం చేసుకోవాలి కదా. అదే విధంగా తమ మీద బురద జల్లుతున్న విపక్ష టీడీపీకి అదే సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇవ్వాలి కదా. మరి ఇవేమీ చేయకుండా వచ్చే ఎన్నికలకు వెళ్తే వైసీపీ మీద ఒక ముద్ర పడిపోయాక చేసేది ఏమీ ఉండదు అంటున్నారు. సోషల్ మీడియా వింగ్ ని వైసీపీ అర్జంట్ గా స్ట్రాంగ్ చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవని సొంత పార్టీలో కూడా సూచనలు వస్తున్నాయి.

Related Posts