YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

బ్లూ కాలర్ జాబ్స్ కు డిమాండ్

బ్లూ కాలర్ జాబ్స్ కు డిమాండ్

ముంబై, ఆగస్టు 27,
డెలివరీ ఎగ్జిక్యూటివ్‌‌లు, డ్రైవర్లు, హౌస్‌‌కీపర్లు వంటి బ్లూకాలర్ జాబ్స్‌‌కు  డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు సుమారు 70 లక్షల బ్లూకాలర్ జాబ్స్‌‌ క్రియేట్ అవుతాయని హ్యూమన్ క్యాపిటల్‌‌ మేనేజ్‌‌మెంట్ కంపెనీ బెటర్‌‌‌‌ప్లేస్‌‌ ఓ సర్వేలో పేర్కొంది. సుమారు 50 శాతం జాబ్‌‌లు ఇండస్ట్రియల్‌‌గా డెవలప్ అయిన మహారాష్ట్ర, తెలంగాణ,  తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచే ఉంటాయని ఈ సర్వే పేర్కొంది. 17 శాతం వాటాతో మహారాష్ట్ర ముందుంటుందని అంచనావేసింది. మొత్తం 1,600 కంపెనీలను సర్వే చేసి ఈ డేటాను బెటర్‌‌‌‌ప్లేస్ రిలీజ్ చేసింది.  కరోనా రిస్ట్రిక్షన్లు తొలగిపోవడం, బిజినెస్‌‌లు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటుండడంతో కంపెనీలకు మ్యాన్‌‌పవర్ అవసరం పెరుగుతోందని ఈ సర్వే తెలిపింది. దీనికి తోడు వినియోగం పెరుగుతుండడం, ఫెస్టివ్ సీజన్‌‌ దగ్గర్లో ఉండడంతో  బ్లూకాలర్‌‌‌‌ జాబ్స్‌‌ కోసం  కంపెనీలు హైరింగ్‌‌ను మొదలుపెడుతున్నాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం, గత 15 నెలల్లో మొదటిసారిగా బ్లూకాలర్ జాబ్స్‌‌ డిమాండ్‌‌  కరోనా ముందు స్థాయిలకు చేరుకుంది. వ్యాక్సినేషన్‌‌ ప్రాసెస్‌‌ వేగంగా జరుగుతుండడంతో వివిధ సెక్టార్లలోని కంపెనీలు  తమ మ్యాన్‌‌పవర్‌‌‌‌ను పెంచుకుంటున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో  హైరింగ్ ట్రెండ్స్‌‌ను విశ్లేషించి బెటర్‌‌‌‌ప్లేస్‌‌ ఈ డేటాను విడుదల చేసింది.  బ్లూకాలర్‌‌‌‌ జాబ్స్‌‌ డిమాండ్‌‌ 2019 తో పోలిస్తే 4 శాతం పెరిగిందని, అదే 2020 తో పోలిస్తే 37 శాతం పెరిగిందని ఈ సర్వే పేర్కొంది.  కరోనా రిస్ట్రిక్షన్లు తొలగిపోవడం, బిజినెస్‌‌లు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటుండంతో మార్కెట్‌‌లో బ్లూకాలర్ జాబ్స్‌‌కు ఫుల్‌‌ డిమాండ్  ఉంది’ అని బెటర్‌‌‌‌ప్లేస్‌‌ సీఈఓ ప్రవిణ్‌‌ అగర్వాల్‌‌ అన్నారు. కంపెనీలు కొత్తగా జాబ్స్‌‌ను క్రియేట్ చేయడం, ముందు తీసేసిన ప్లేస్‌‌లో మళ్లీ నియామకాలు చేపట్టడం వంటివి చేస్తున్నాయని చెప్పారు. లాజిస్టిక్స్‌‌, ఆన్‌‌లైన్ షాపింగ్‌‌, ఎఫ్‌‌ఎంసీజీ, రిటెయిల్‌‌, క్లాత్స్‌‌, హెల్త్‌‌ కేర్‌‌‌‌, ఐటీ, ఐటీ రిలేటెడ్‌‌ సర్వీసులు, బ్యాంకింగ్‌‌, ఫైనాన్షియల్‌‌ సర్వీసులు, ఇన్సూరెన్స్‌‌ (బీఎఫ్‌‌ఎస్‌‌ఐ) వంటి సెక్టార్లలో బ్లూకాలర్ జాబ్స్ నియామకాలు పెరుగుతున్నాయి.  బెటర్‌‌‌‌ప్లేస్‌‌ తన సర్వేలో కన్‌‌స్ట్రక్షన్‌‌ సెక్టార్‌‌‌‌ను, మాన్యుఫాక్చరింగ్‌‌ సెక్టార్‌‌‌‌లో మెజార్టీ సెగ్మెంట్లను పరిగణనలోకి తీసుకోలేదు. ‘కరోనా ఫస్ట్‌‌వేవ్‌‌ తర్వాత కంటే, కరోనా సెకెండ్‌‌ వేవ్‌‌ తర్వాత కంపెనీలు బాగా ప్రిపేర్‌‌‌‌గా ఉన్నాయి.  ఎకానమీ కూడా రికవరీ బాటలో ఉంది. ఒకవేళ థర్డ్‌‌వేవ్‌‌ వచ్చినా ఎదుర్కోగలమనే నమ్మకంతో కంపెనీలు ఉన్నాయి. వినియోగం పెరుగుతుండడం, దేశం మొత్తం మీద వ్యాక్సినేషన్‌‌ జరుగుతుండడంతో వంటి అంశాలు హైరింగ్ యాక్టివిటీ పెరగడంలో కీలకంగా ఉన్నాయి’ అని అగర్వాల్‌‌ అభిప్రాయపడ్డారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌లు, డ్రైవర్లు, హౌస్‌‌‌‌కీపర్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌లు, కస్టమర్‌‌‌‌‌‌‌‌ కేర్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌లు, కట్టు మిషన్‌‌‌‌ను ఆపరేట్ చేసేవాళ్లు, సెక్యూరిటీ గార్డులు, మెడికల్‌‌‌‌ సేల్స్ రిప్రెంజెంటివ్‌‌‌‌లు, వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌లో పనిచేసేవాళ్లు.. ఇలాంటి జాబ్స్‌‌‌‌కు ఎక్కువగా డిమాండ్ ఉందని బెటర్‌‌‌‌‌‌‌‌ప్లేస్‌‌‌‌  సర్వే తెలిపింది. ఎకానమీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తెచ్చిన స్కీమ్‌‌‌‌లు  జాబ్‌ క్రియేషన్‌‌‌‌లో కీలకంగా ఉన్నాయని ఆదిత్య బిర్లా గ్రూప్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ సంత్రప్త్‌‌‌‌ మిశ్రా అన్నారు. గ్రూప్ కంపెనీల్లో హైరింగ్‌‌‌‌ పెరుగుతోందని చెప్పారు. బిజినెస్‌‌‌‌ విస్తరణ కోసం మ్యాన్‌‌‌‌పవర్‌‌‌‌‌‌‌‌ను పెంచుకుంటున్నామని ఆర్‌‌‌‌‌‌‌‌పీజీ గ్రూప్ కంపెనీ సియెట్‌‌‌‌ ప్రకటించింది.ఎక్కువగా చెన్నై, నాగ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లలో హైరింగ్ చేపట్టామని  సియెట్‌‌‌‌ చీఫ్‌‌‌‌ హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ మిలిండ్‌‌‌‌ ఆప్టే అన్నారు. సుమారు 200–300 మంది అసోసియేట్లను నియమించుకుంటామని చెప్పారు.  ‘బ్లూకాలర్ జాబ్ మార్కెట్‌‌‌‌ బాగుంది. కొత్తగా జాబ్స్‌‌‌‌ క్రియేట్ అవ్వడంలో లిమిట్స్ ఉన్నా, గతంలో ఉద్యోగులను తీసేసిన పోస్టులలోకి మళ్లీ  హైరింగ్ చేపడుతున్నారు’ అని కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్‌‌‌‌ మదన్‌‌‌‌ సబ్నవిస్‌‌‌‌ పేర్కొన్నారు.  ఈ–కామర్స్‌‌‌‌, లాజిస్టిక్స్‌‌‌‌, టెక్నాలజీ  వంటి వేగంగా విస్తరిస్తున్న సెక్టార్లలో  కొత్త జాబ్‌‌‌‌లు ఎక్కువగా క్రియేట్‌‌‌‌ అవుతున్నాయని,  ఇతర సర్వీస్‌‌‌‌ సెక్టార్లలో గతంలో తొలగించిన పోస్టుల కోసం హైరింగ్ ఎక్కువగా జరుగుతోందని  ఆయన చెప్పారు. గిగ్‌‌‌‌ జాబ్స్‌‌‌‌(టెంపరరీ జాబ్స్‌‌‌‌) కు డిమాండ్ పెరుగుతుందని కూడా బెటర్‌‌‌‌‌‌‌‌ప్లేస్ సర్వే అంచనావేసింది. గిగ్‌‌‌‌ ఎకానమీ లాంగ్‌‌‌‌టెర్మ్‌‌‌‌లో సుమారు 9 కోట్ల మందికి ఉద్యోగాలను కల్పిస్తుందని  ఈ  సర్వే అంచనావేసింది

Related Posts