హైదరాబాద్
మంత్రి మల్లారెడ్డి రైతు బంధు పేరు మీద సంవత్సరానికి 60 లక్షలు తీసుకుంటున్నాడు. అంటే నాలుగు సంవత్సరాలలో 2 కోట్ల 40 లక్షలు మల్లారెడ్డికి ముట్టినయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కెసిఆర్ గారి పాలన ఎవరికీ పన్నీరు ఎవరికీ కన్నీరు..? కేసీఆర్ చిన్న అటెండర్ ఉద్యోగి తల్లిదండ్రులకు పెన్షన్ వద్దు అంటాడు. మంత్రులకు మాత్రం రైతు బంధు కావాలా అని ఆమె ప్రశ్నించారు.