న్యూఢిల్లీ ఆగష్టు 27
ఢిల్లీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు సోనూ సూద్ వ్యవహరించనున్నట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం దేశ్ కే మెంటర్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఆ కార్యక్రమాన్ని త్వరలో ఆవిష్కరించనున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దేందుకు తనకు శిక్షకుడి (మెంటర్) రూపంలో అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని సోనూ సూద్ తెలిపారు. విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం కన్నా మరో గొప్ప సేవలేదని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్నట్లు సోనూ సూద్ తెలిపారు. సోనూ సూద్‌ను దేశ్ కే మెంటర్స్ ప్రోగ్రామ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్‌ోట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు.