హైదరాబాద్
నిజాం, కోఠి ఉమెన్స్ , సైఫాబాద్ కళాశాలల వసతి గృహాలను తొలిగిస్తున్నట్లు సర్క్యులర్ విడుదల కావడంతో... ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. సర్క్యులర్ జారీ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి రవీందర్ యాదవ్ దిష్టిబొమ్మను బషీర్ బాగ్ లోని నిజాం కాలేజి ముందు దహానం చేసారు. గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా వీసీ తన వైఖరిని మార్చుకొని... హాస్టల్ లను కొనసాగించాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో వేలాదిమంది విద్యార్థులతో కలిసి విసి ఛాంబర్ ను దిగ్బంధిస్తామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు.