సికింద్రాబాద్
అధికార పార్టీకి ,ముఖ్యమంత్రి కేసీఆర్ కు హుజురాబాద్ ఉప ఎన్నికల ఓటమి భయం పట్టుకుందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి అన్నారు..కరీంనగర్ హుజురాబాద్ లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని ఉప ఎన్నికలను వాయిదా వేసే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ఖండించారు..ఇదే విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తో సమావేశమై ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు.. ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరోన నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను తెరుస్తున్న నేపథ్యంలో హుజరాబాద్ లో కరోన కేసులు పెరిగాయని ఉప ఎన్నిక వాయిదా వేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు..హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా బోగస్ ఓట్లు నమోదు చేసే కార్యక్రమం జరుగుతున్నట్లు ఆయన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు..మండల స్థాయిలో నియమించబడిన ఎన్నికల అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారని వెంటనే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు..వీలైనంత త్వరగా హుజురాబాద్ ఉప ఎన్నిక పూర్తి చేయాలని ఎన్నికల అధికారులను కోరినట్లు వెల్లడించారు..సమాచార హక్కు చట్టం కింద ఓట్ లో కి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని ఎన్నికల అధికారిని కోరినట్లు తెలిపారు.