YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇరాక్ లో నరకం

ఇరాక్ లో నరకం

ఇరాక్ లో పోలీసుల చేతికి చిక్కి కష్టాలు పడుతున్న ఓ తెలుగు యువకుడికి మంత్రి కేటీఆర్ చొరవతో విముక్తి లభించింది. హైదరాబాద్ చేరుకున్న బాధితుడు ఇరాక్ లో తాను ఏజెంట్ల చేతిలో మోసపోయి అనుభవించిన కష్టాలను మీడియా కు వివరించి బోరుమన్నాడు. తూర్పు గోదావరి జిల్లా లోని ద్వారకాతిరుమల మండలానికి చెందిన నాగేందర్ గత ఏడాది బతుకు దెరువు కోసం ఇరాక్ కు వెళ్ళాడు.ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కు చెందిన ఏజెంట్ సత్యం కు లక్షా 90 వేలు చెల్లించాడు. అయితే నాగేందర్ ను ఇరాక్ కు తీసుకెళ్ళిన ఏజెంట్ అతన్ని ఇరాక్ లో వదిలేసి వెళ్లి పోయాడు.దీంతో ఉపాధి కోసం ఇరాక్ కు వెళ్ళిన నాగేందర్ ఏజెంట్ల చేతిలో మోసపోయి పోలీసుల చేతిలో బంధీగా ఇరుక్కున్నాడు. దీంతో సోషల్ మీడియా ద్వారా తన గోడు ను చెప్పుకున్నాడు నాగేందర్. దీనికి స్పందించిన తెలంగాణ గల్ఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు  బసంత్ రెడ్డి, తెలుగు యువత మేల్కో సంస్థ అధ్యక్షుడు చారీ మంత్రి కేటీఆర్ ద్వారా నాగేందర్ విడుదల కోసం కృషి చేశారు. వీరి ఫలితం ఫలించడంతో  నాగేందర్ ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నాడు.ఈ మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మీడియా తో మాట్లాడి న బాధితుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు.  నాగేందర్ విడుదల కోసం కృషి చేసినందుకు గాను స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. అదే విధంగా ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బాధితులకు పునరావాసం కల్పించి ఆదుకోవాలని వారు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.నాగేందర్ ను మోసం చేసిన ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని ఈ రోజు తెలంగాణ డీజీపీ ని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు స్వచ్చంధ సంస్థత  ప్రతినిధులు మీడియా కు వివరించారు.

Related Posts