సెప్టెంబర్ 2 నుంచి తెరాస జెండా పండుగలు
మంత్రి కేటీఆర్
సెప్టెంబర్ 2న 12769గ్రామ పంచాయతీ లు , 142మున్సిపాలిటీ లలో జెండా పండుగ తో పాటు అదే రోజు నుంచి గ్రామ కమిటీ ల నిర్మాణం మొదలవుతుందని మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 2 నే ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు..దానికి మేమంతా హాజరవుతాం. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ ,వార్డు కమిటీ లు వేస్తాం. సెప్టెంబర్ 12 నుంచి 20 వరకు మండల కమిటీ లు పూర్తి చేస్తాం. సెప్టెంబర్ 20 తర్వాత జిల్లా కమిటీ ల నిర్మాణం పూర్తి చేస్తాం. మొత్తానికి సెప్టెంబర్ నెలలో అన్ని కమిటీ లు పూర్తి చేస్తామని అన్నారు. హైదరాబాద్ లో బస్తి కమిటీ లు ,డివిజన్ కమిటీ లు వేస్తాం. అన్ని కమిటీ లలో యస్సీ ,యస్టీ ,బీసీ ,మహిళలలుకు 51శాతం కమిటీ లలో ఉండేలా చూస్తాం.క్రియాశీలకంగా పనిచేసేవారికే కమిటీ లలో ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. రెండు ,మూడు రోజుల లో జీహెచ్ఎంసీ పరిదిలో ని మా పార్టీ ప్రతినిధులతో సమావేశమవుతాం. సెప్టెంబర్ 1న సాయంత్రం లోపు మా ప్రజాప్రతినిధులు ఢిల్లీ కి చేరుకోవాలని కోరుతున్నా. ఢిల్లీ లో పార్టీ కార్యాలయం అద్బతంగా ఉంటుంది.
కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని వారు కేసీఆర్ ను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు... మేమేమన్నా అన్నామా. మా మంత్రి మల్లారెడ్డి కి జోష్ ఎక్కువ ..ఓ మాట అన్నారు తప్పేముంది. కాంగ్రెస్ కు దిక్కు లేక చంద్రబాబు ఏజెంట్ ను పీసీసీ చేసారు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషేంటి. చంద్రబాబు మాటలు నమ్మి ఓటుకు నోటు దొంగ ను కాంగ్రెస్ నేతలు పీసీసీ చేసారు. చెంపమీద కొడతా అంటే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి ని అరెస్ట్ చేసింది. కొందరు జర్నలిస్టు మిత్రులు కూడా జర్నలిజం ముసుగులో కేసీఆర్ ను ఇష్టమోచ్చినట్లు తిడుతున్నారు. ఓపికకు కూడా సహనం ఉంటుంది. ప్రతిపక్షాలు తిడితే చూస్తూ ఊరుకోవాలా. బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు సమాధానం చెప్పాలి. ఇంకా ఏవైనా భూములు ఉంటే అమ్మడానికి. మేక్ ఇన్ ఇండియా అని సేల్ ఇండియా చేస్తున్నారు. మోడీ చెప్పిన రెండు కోట్ల ఉధ్యోగాలు ఏవి. ప్రభుత్వ సంస్థలు అమ్ముతున్నందుకా బండి సంజయ్ యాత్ర. బండి సంజయ్ యాత్రలో ప్రతి ఊరులో ఉన్న నర్సరీలు ,వైకుంఠ థామాలు చూసి మాట్లాడాలని అన్నారు.
మిషన్ భగీరథ ,మిషన్ కాకతీయ కు ఓక్క రూపాయి అయినా కేంద్రం ఇచ్చిందా. కేంద్ర ప్రభుత్వం లో 8 లక్షల ఉధ్యోగాలు కాలీగా ఉన్నాయి.. వీటి గురించి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడరు. పచ్చి పచ్చి మాటలు మాట్లాడినందుకే ..కొడంగల్ నుంచి తరిమితే..చావు తప్పి కన్ను లొట్ట బోయినట్లు మల్కాజిగిరి లో గెలిచాడు.
రేవంత్ రెడ్డి ముందు మంత్రి మల్లారెడ్డి సవాల్ పై మాట్లాడి గజ్వేల్ సభ గురించి మాట్లాడితే మంచిది. టీ కాంగ్రెస్ ను చంద్రబాబు ఫ్రాంచైజీ లెక్క తీసుకున్నడు. చిలక మనదే అయినా ..మాట్లాడిస్తున్నది. చంద్రబాబని కేటీఆర్ అన్నారు. .