తాడిపత్రిలో కరోనా విజృంభన
తాడిపత్రి
అనంతపురం జిల్లా తాడిపత్రి లో కరోనా కేసులు విజృంభించాయి. పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాల, రెండు ప్రభుత్వ పాఠశాలల్లో మూడు కరోనా కేసులు నమోదు కావడం తో తాడిపత్రి లో ఒక్కసారిగా అలజడి రేకెత్తింది.పాఠశాలలు ప్రారంభం అయి ఒక వారం కూడా గడవకముందే పాఠశాల లలో కరోనా కేసులు నమోదు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులలో స్కూల్ కు పంపిస్తే ఒక సమస్య, పంపించకపోతే ఒక సమస్య తలెత్తింది.ఈ ఘటన పై తాడిపత్రి విధ్యాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో విధిగా శానిటేషన్ చేయాలని, ప్రతి పాఠశాల కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్నారు. ప్రతి పాఠశాలలో విధిగా ఉదయము, మధ్యాహ్నము ధర్మల్ స్కాన్ ద్వారా విద్యార్థుల టెంపరేచర్ పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చామని ,కరోనా నిబంధనలు పాటించని పాఠశాల లపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. తాను కూడా తాడిపత్రిలోని ప్రతి పాఠశాలను పరిశీలిస్తున్నానని ఈ సందర్భంగా ఎంఇఓ నాగరాజు తెలిపారు.