YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కురులతో వేల కోట్ల హాంఫట్

కురులతో వేల కోట్ల హాంఫట్

కురులతో వేల కోట్ల హాంఫట్
తిరుపతి, ఆగస్టు 27,
కురులతో కోట్లు హాంఫట్.. ఈ దందా వెనుక జిత్తులమారి డ్రాగన్ వేషాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఆరువేల కోట్లకు పైగా జరిగిన స్కాంలో చైనాదే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి వేల కోట్ల రూపాయల విలువ చేసే వెంట్రుకలు జిన్‌ పింగ్‌ ఇలాఖాకు తరలిపోయాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో జీఎస్టీకి భారీగా గండికొట్టినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు గుర్తించాయి. ఈ మధ్యే మానవుల వెంట్రుకల ఎగుమతులపై జీఎస్టీ విధించారు. వెంట్రుకల స్మగ్లింగ్‌ను అరికట్టేందుకే ప్రధానంగా జీఎస్టీ ప్రయోగించారు.అయినా స్మగ్లర్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల కళ్లుగప్పి చైనాకు వెంట్రుకలు తరలిస్తున్నారు. వయా మయన్మార్ మీదుగా చైనా, వియత్నాంకు తరలిస్తున్నారు. మయన్మార్‌కు వెంట్రుకల ఎగుమతిలో హావాలా జరిగినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ గుర్తించారు. అలాగే బంగారం రూపంలో హవాలా దందా కొనసాగుతున్నట్టు కస్టమ్స్‌ అధికారులు తేల్చారు.వెంట్రుకలు ఏపీ, తెలంగాణలోని ప్రధాన ఆలయాలు, చర్చి, హెయిర్ సెలూన్‌, ఇళ్ల దగ్గర స్మగ్లింగ్‌ ముఠాలు సేకరిస్తున్నారు. అలా సేకరించిన వెంట్రుకల్ని సికింద్రాబాద్ నుంచి కోల్‌కతా, గౌహతిల మీదుగా మయన్మార్‌కు తరలిస్తున్నారు.అక్కడినుంచి నేరుగా చైనా, వియత్నాంలకు వెంట్రుకలు తరలిపోతున్నాయి. ఎగుమతి పన్ను నుంచి తప్పించుకునేందుకు నకిలీ వే బిల్లులు సృష్టిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

Related Posts