YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

పంచరత్న రథోత్సవంపై ఊరేగిన ప్రహ్లాద రాయలు.

పంచరత్న రథోత్సవంపై ఊరేగిన ప్రహ్లాద రాయలు.

పంచరత్న రథోత్సవంపై ఊరేగిన ప్రహ్లాద రాయలు.                        
ఘనంగా సర్వ సమర్పణోత్సవం. వైభవంగా ముగిసిన రాఘవేంద్ర స్వామి సప్తరాత్సోవాలు    మంత్రాలయం
 సర్వ సమర్పణోత్సవ కార్యక్రమంతో రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో ఘనంగా ముగిశాయి. శుక్రవారం సప్తరాత్రోత్సవాలలో భాగంగా రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి నిర్మాల్య విసర్జనం, పంచామృత అభిషేకము స్వర్ణ కవచ సమర్పణ  విశేష పుష్పాలంకరణ గావించి మహా మంగళ హారతులు సమర్పించారు.మూల రఘుపతి వేద వ్యాసధేవువుని పూజ అలంకారం హస్తదకం  మహా మంగళహారతి తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. ఉత్సవాలలో భాగంగా                      
అనుమంత్రాలయంలో (తుంగబద్ర )లో  రాఘవేంద్ర స్వామి రథోత్సవం పీఠాధిపతులు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. తుంగభద్ర లో ఉన్న అనుమంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో బృందావనానికి విశేష పూజలు గావించి రథోత్సవాన్ని నిర్వహించారు. పీఠాధిపతులు భక్తులకు అనుగ్రహ సందేశం ఇస్తూ ఫల మంతాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. శ్రీమఠంలో పూజామందిరంలో మూల రాముల పూజలు గావించి మహామంగళహారతి గావించారు. సాయంత్రం సర్వ సమర్పణోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. చక్కెరథోత్సవంపై  అశ్వ గజ సింహా బంగారు పల్లకిలను  అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లద రాయులను సర్వ సమర్పణోత్సవ  కార్యక్రమంలో భాగంగా పంచ రథోత్సవం పై ఆశీనులు గావించి వేదమంత్రాల సాక్షిగా మంగళ వాయిద్యాలతో అశేష భక్త జన వాహిని  మధ్య శ్రీ మఠం ప్రాంగణంలో పీఠాధిపతులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పంచ రథోత్సవ కార్యక్రమం జరిగింది. వేలాది మంది భక్తులు కన్నులారా గాంచి పునీతులయ్యారు. అనంతరం ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలను ఉంజల మండపంలో  ఉంచి ఉంజల సేవ గావించి మంగళ హారతులు సమర్పించారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి మహా మంగళారతులు సమర్పించడంతో శ్రీ గురు సార్వభౌములు 350.వ. సప్త రాత్సోవాలకు  ఘనంగా ముగింపు పలికారు .వారం రోజులుగా జరిగిన రాఘవేంద్ర స్వామి ఉత్సవాలు విశేషమైన పూజా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు వెండి బంగారు వెండి అంబారి నవరాత్రి ఉత్సవాలు మహారథోత్సవం సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల కోలాటాలు భక్తి పాటలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సప్త రాత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. 350. వ. ఆరాధన మహోత్సవాలు వైభవంగా ముగియడంతో వివిధ శాఖల అధికారులు సిబ్బందిని పాత్రికేయులను  శేష వస్త్రం ఫల మంత్రాక్షతలు ఇచ్చి పీఠాదిపతులు ఆశీర్వదించారు.

Related Posts