YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నియోజకవర్గ అభివృద్ధి నిధులతో ప్రభుత్వ పాఠశాలల కు మహర్దశ. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

నియోజకవర్గ అభివృద్ధి నిధులతో ప్రభుత్వ పాఠశాలల కు మహర్దశ. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

నియోజకవర్గ అభివృద్ధి నిధులతో ప్రభుత్వ పాఠశాలల కు మహర్దశ
         మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్ ఆగష్టు
;శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో జంట నగరాలలోని ప్రభుత్వ పాఠశాలల కు మహర్దశ తీసుకవస్తానని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శాసనసభ్యులతో నియోజకవర్గ అభివృద్ధి నిధుల వినియోగంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శర్మన్, శాసనమండలి విప్ ప్రభాకర్, ఎంఎల్ఏలు లు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, జాఫర్ హుస్సేన్, సంయుక్త సంచాలకులు, ముఖ్య ప్రణాళిక అధికారి డాక్టర్ N. సురేందర్, జిల్లా విద్యాధికారి రోహిణి, రవీందర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఇటీవల కలెక్టర్ గా బాద్యతలు చేపట్టిన శర్మన్ ను ఎంఎల్ఏలు లకు పరిచయం చేశారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యారంగ  పురోభివృద్ధి కి తీసుకుంటున్న చర్యలలో భాగంగా ప్రతి ఎంఎల్ఏలు తన నియోజకవర్గ నియోజకవర్గ అభివృద్ధి నిధులలో 2 కోట్ల రూపాయల ను ఆయా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఒక్కో ఎంఎల్ఏలు కు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులతో  ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేపట్టనున్న నేపధ్యంలో ప్రస్తుత పాఠశాలల పరిస్థితుల పై ఫోటోలతో కూడిన పూర్తిస్థాయి సమాచారం సేకరించి వాటి అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై, ఆయా నియోజకవర్గ శాసనసభ్యుల సహకారంతో సమగ్ర నివేదిక రూపొందించి 10 రోజులలో అందజేయాలని డిఇఓను మంత్రి ఆదేశించారు. పాఠశాలలల్లో విద్యార్ధులకు ఫర్నిచర్, త్రాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ వంటి సౌకర్యాలను కల్పించడంతో పాటు పాఠశాలలల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని విద్యా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. వచ్చే సోమవారం) నాడు కలెక్టర్ ఆధ్వర్యంలో డిప్యూటీడిఇఓలు, ప్రదానోపాద్యాయు లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆయా పాఠశాలలల్లో  చేపట్టవలసిన అభివృద్ధి పనులపై పాఠశాలల వారిగా సమగ్ర సమాచారం సేకరించాలని చెప్పారు. అంతేకాకుండా సర్వ శిక్ష అభియాన్ క్రింద ప్రభుత్వ పాఠశాలలకు మంజూరు చేస్తున్న నిధులు సక్రమంగా సద్వినియోగం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రధానంగా ఉన్న సీవరేజ్, త్రాగునీటి పైప్ లైన్ ల పనుల కోసం నియోజకవర్గ అభివృద్ధి నిధులను అత్యధికంగా ఖర్చు చేయడం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. ఈ సందర్భంగా పలువురు ఎంఎల్ఏలు లు మాట్లాడుతూ ఏసిడిపి నిధులతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులతో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్ అభివృద్ధి పనులు కూడా చేపట్టేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఏసిడిపి నిధులతో చేపట్టే అభివృద్ధి పనులలో రోడ్ కటింగ్ కోసం వసూలు చేసే రుసుము నుండి మినహాయింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి విన్నవించారు. ఏసిడిపి నిధులతో చేపట్టే జలమండలి,జీహెచ్ఎంసి తదితర శాఖలకు చెందిన పనులకు అయ్యే ఖర్చులో ఆయా శాఖలు సగభాగం  నిధులు చెల్లించేలా ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఎంఎల్ఏలు లు తన దృష్టికి తీసుకొచ్చిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Related Posts