సకల తీర్థాలకు రాజుగా పేరుపొందిన 'ప్రయాగరాజ్ క్షేత్రంలో త్రివేణి సంగమ తీరంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు శ్రీ వేణీ మాధవుడి పేరుతో కొలువుదీరి, దర్శిం చినంతనే సకల శుభాలను ప్రసాదించే దేవుడుగా పేరు పొంది అశేష భక్తుల విశేష ఆరాధనలు అందుకుంటూ వున్నాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణా శికి సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ప్రయాగరాజ్ క్షేత్రం వుంది. సృష్టికర్త, ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు ఈ ప్రాంతంలో పూర్వం యజ్ఞం చేసినట్లు కథనం. ప్రజా పతి యాగం చేసిన ప్రాంతం కనుక దీనికి 'ప్రయాగ' అనే పేరు ఏర్పడింది. కాగా మొఘల్ చక్రవర్తి అక్బర్ 1584 సంవత్సరంలో కోటను నిర్మింపజేయడంతో పాటు ప్రయాగ పేరును 'అలహాబాద్'గా మార్చివేశాడు. , అప్పటి నుంచి అలహాబాద్ పట్నంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం పేరును ఇటీవలే ప్రయాగరాజ్ గా మార్చారు. అటువంటి ప్రయాగరాజ్ క్షేత్రంలో అత్యంత ప్రాచీనమైన ఆలయం...
శ్రీ వేణీ మాధవ్ ఆలయం.
ఈ ఆలయంలో స్వామివారు కొలువుదీరడం వెనుక ఆసక్తి కరమైన పురాణగాథ వుంది. అది సృష్టికర్త అయిన బ్రహ్మదే వుడితో ముడిపడి వుంది. శ్రీమహావిష్ణువు నాభి నుంచి ఉద్భవించిన పద్మంలో జనించి సృష్టి చేసే కార్యక్రమాన్ని చేపట్టిన బ్రహ్మదేవుడికి తాను సృష్టిస్తున్న ప్రజలు నివసి స్తున్న భూలోకాన్ని దర్శించాలనే కోరిక కలిగింది. దీనితో బ్రహ్మదేవుడు సత్యలోకాన్ని వదిలి భూలోకం చేరాడు. * వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రస్తుత ప్రయాగరాజ్ క్షేత్ర ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. త్రివేణీ సంగమ తీరంలో వున్న ఈ ప్రాంతం బ్రహ్మదేవుణ్ణి ఆకర్షించింది. ఈ ప్రాంతంలోనే కొన్ని రోజులు గడిపి యాగం చేయాలనే కోరిక కలిగి, త్రివేణి సంగమ తీరంలో అందుకు అను వైన ప్రస్తుత ఆలయ ప్రాంతాన్ని వేదికగా చేసు కున్నాడు. త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించి, యాగం చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా యాగం చేయడం ప్రారంభిం చిన బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యాన్ని మరిచి భూలోకం లోనే వుండిపోయాడు. దీనితో ఇంద్రాది దేవతలు శ్రీమహావి ష్ణువు వద్దకు చేరుకుని, విష యాన్ని వివరించారు. విషయం తెలుసుకున్న శ్రీము హావిష్ణువు లక్ష్మీదేవి సమేతుడై భూలోకం చేరుకుని బ్రహ్మదే వుడు యాగం చేస్తూ వున్న ప్రాంతానికి చేరుకోగా, బ్రహ్మ దేవుడు విష్ణువును భక్తితో పూజించాడు. బ్రహ్మదేవుడికి కర్తవ్యాన్ని గుర్తుచేసిన శ్రీమహా విష్ణువు, బ్రహ్మదేవుడి ప్రార్థన మేరకు లక్ష్మీ సమేతుడై బ్రహ్మ యాగం చేసిన ప్రాంతంలో - శ్రీవేణి మాధవస్వామి పేరుతో కొలువుదీరినట్లు స్థలపురాణం వెల్లడిస్తూ వుంది.
ప్రయాగరాజ్ క్షేత్రంలో త్రివేణీ సంగమానికి సమీపంలో ‘దరియా గంజ్ ప్రాంతంలో శ్రీవేణీ మాధవ్ మందిరం వుంది. ఆలయానికి సమీ పంలో ప్రయాగ ఫట్ స్నానఘట్టం వుంది. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమ ప్రాంతంలో కొలువుదీరిన ప్రయాగరాజ్ క్షేత్రంలో అత్యంత ప్రాచీనమైన ఆలయం వుంది. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఆలయం దర్శనమిస్తుంది. గర్భాలయం పైభాగంలో ఉత్తర భారత నిర్మాణ శైలిలో నిర్మింపబడిన ఎత్తయిన గోపురం దర్శనమిస్తుంది. ఆలయం తూర్పునకు అభిముఖంగా రెండు అంతస్తులతో వుంది.
ప్రధాన ఆలయం ముఖమం డపం, ప్రదక్షిణామండపం, గర్భా లయాలను కలిగి వుంది. ప్రధాన గర్భాలయంలో వేదిక పైన శ్రీ వేణీమాధవుడు దేవేరి సమేతుడై దివ్యమైన అలంకారాలతో దర్శమి స్తాడు. శ్రీలక్ష్మీ సమేతంగా కొలు వుదీరిన శ్రీ వేణీమాధవస్వామి వారిని శ్రీలక్ష్మీనారాయణస్వామి, శ్రీకృష్ణ పరమాత్మగా భక్తులు భావించి ఆరాధిస్తారు. క్రింది అంతస్తులో ఈ విధంగా శ్రీలక్ష్మీ నారాయణ స్వామివారు కొలువు దీరి వుండగా, పై అంతస్తులోని గర్భాలయంలో జగన్మాత శ్రీ దుర్గాదేవి కొలువుదీరి వుంది. సింహవాహనం పై ఆశీనురాలై చేతులలో వివిధ ఆయుధాలను ధరించి, అమ్మవారు కొలువుదీరి వున్నారు. అమ్మవారికి కుడివైపున శ్రీ కాళికాదేవి అమ్మవారు, ఎడమ వైపున శ్రీ రాధాకృష్ణస్వామివారు కూడా కొలువుదీరి దర్శనమిస్తారు. ఈ ఆలయంతో పాటు ప్రయాగరాజ్ క్షేత్రంలోని భక్తులు శ్రీ మాధవేశ్వరీదేవి - శక్తిపీఠం, శ్రీ శయనాంజనేయస్వామి వారి ఆలయం, కంచి కామకోటి పీఠం వారి ఆలయం, భరద్వాజ ఆశ్రమం, ఆనంద భవన్, స్వరాజ్య భవను దర్శించుకోవచ్చు.. చారిత్రకంగా పరిశీలిస్తే ఆర్యుల సంస్కృతీ కాలం నుంచే ప్రయాగ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గుప్తుల పాలనాకాలంలో క్షేత్ర అభివృ ద్దితో పాటు శ్రీ వేణీ మాధవస్వామి ఆలయాభివృద్ధి కూడా జరిగినట్లు చరిత్ర చెబుతోంది. గుప్త వంశ పాలకుడైన సముద్రగుప్తుడు . (336-380), పుష్యభూతి వంశ పాలకుడైన హర్షవర్ధనుడు (606-647) ఆలయాభివృద్ధికి కృషి చేయడంతో స్వామివారిని దర్శించి సేవించినట్లు కథనం. కాగా బెంగాలకు చెందిన వైష్ణవ గురువు చైతన్య మహాప్రభు (1486-1534) ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారిని సేవించడంతో పాటు కొన్నిరోజులు ఆలయంలోనే గడిపి నట్లు కథనం. సుమారు రెండు దశాబ్దాల క్రితం ఆలయంలో జీర్ణోద్ధరణ కార్యక్రమాలను చేపట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ప్రతిరోజూ పూజలు జరిగే ప్రయాగరాజ్ శ్రీ వేణీమాధవస్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ప్రధానంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. దేవీ నవరా త్రుల సందర్భంగా తొమ్మిది రోజులపాటు ప్రత్యేక అలంకారాలు, పూజలను చేస్తారు. పన్నెండు సంవత్సరా లకు ఒకసారి ప్రయాగరాజ్ లో జరిగే కుంభమేళ సమయంలో ఉత్సవా లను నిర్వహిస్తారు. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు ముందుగా స్వామివారిని దర్శించడం విశేషం.
ప్రయాగరాజ్ క్షేత్రంలో ఆలయం వున్న దరియాగంజ్ ప్రాంతంలోనే తెలుగువారి సత్రాలు, ఆశ్రమాలు వున్నాయి. ఇందులో భక్తులకు వసతి, భోజన సౌకర్యాలు లభిస్తాయి. ప్రైవేటు లాడ్జీలలో కూడా భక్తులకు వసతి సౌకర్యాలు లభిస్తాయి. లక్నో నుంచి 287, వారణాశి నంచి 135, పాట్నా నుంచి 368, ఢిల్లీ నుంచి 765 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రయాగరాజ్ క్షేత్రానికి అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సు, రైలు, విమాన సర్వీసులు వున్నాయి. తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, వరం గల్, తిరుపతి, గూడూరు, విజయవాడ, విశాఖపట్నం, గుంతకల్లుల నుంచి ప్రయాగరాజ కు సరాసరి రైలు సౌకర్యాలు వున్నాయి. సకల శుభాలను ప్రసాదించే దేవుడుగా ప్రసిద్ధి చెందిన ప్రయాగరాజ్ శ్రీ వేణీ మాధవస్వామిని దర్శించి భక్తులు తరించవచ్చు.