YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

జ్యేష్టాలక్ష్మి

జ్యేష్టాలక్ష్మి

ఆ ఐశ్వర్యాన్ని పెంచాలి అంటే జ్యేష్టా దేవి మంత్రాన్ని బాగా చేస్తే అది మన ప్రారబ్దాలని తీసివేస్తుంది. ధనవృద్ధిని కోరుకునే వారు జ్యేష్టాదేవి మంత్రం జపం చేయాలి. అందరూ మహాలక్ష్మి మంత్రాన్ని జపం చేస్తూ ఉంటారు. జ్యేష్టా దేవి దరిద్ర దేవత అని ఆమెను అందరూ చేయరు. కానీ మహాలక్ష్మి ఇచ్చినా సరే ఈ జ్యేష్టా దేవి అనుమతి లేనిదే అది నిలవదు. కాబట్టి మహాలక్ష్మి మంత్రాన్ని జపం చేసే వారు అందరూ జ్యేష్టా దేవి మంత్రాన్ని తప్పకుండా చేయాలి. ఇది మంత్ర శాస్త్ర రహస్యం.* 

 

* ఉద్యధ్భాస్కర సన్నిభా స్మితముఖీ రక్తాంబరాలేపనా |* 

*సత్కుంభం ధనభాజనం సృణిమధో పాశంకరై బ్రిభ్రతీ ||* 

*పద్మస్థా, కమలేక్షణా దృడకుచా సౌందర్య వారాం నిది,|*

*ద్యాతవ్యా సకలాభిలాష ఫలదా శ్రీ జ్యేష్టలక్ష్మీరియం|| *

 

*అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వంటి కాంతి గల శరీరంతో , చిరునవ్వు చిందించే ముఖం తో , ఎర్రనైన వస్త్రములు ధరించి, సత్ కుంభం, ధనభాజనము, రక్తపాత్ర, పాశములను చేతుల యందు ధరించి ఉంది జ్యేష్టా లక్ష్మి. ధన భాజనము అంటే సంపద, ఐశ్వర్యం, రక్త పాత్ర అంటే దారిద్ర్యం. ఈ రెండూ ఎందుకు అంటే ప్రసన్నురాలైతే ఐశ్వర్యాన్ని, ఆగ్రహిస్తే దరిద్రం, కష్టాలు ఇస్తుంది. పద్మస్త అంటే పద్మములో కూర్చుని కమలేక్షణ పెద్ద పెద్ద కన్నులు కలిగిన, ధృఢకుచ అంటే పూర్ణమైన కుంభములవంటి స్థనములు కలిగిన, సౌందర్య వారాదిని చాలా అందంగా ఉంటుంది జ్యేష్టా దేవి. ఈ విధంగా ధ్యానం చేయాలి. సకలాభిలాష ఫలద అ విధంగా ప్రార్థన చేస్తే అన్ని కోరికలు తీరుస్తుంది. సంపదని ప్రసాదిస్తుంది. ధనం ఒక్క లక్ష్మీ దేవే ఇస్తుంది. దరిద్రం తీసివేయలేదు. ఆ ధనాన్ని అనుభవించే యోగాన్ని , ప్రాప్తిని జ్యేష్టా దేవి కలిగిస్తుంది. ఈ జ్యేష్టాదేవి దారిద్ర్యం తీసివేస్తుంది. సందను ఇచ్చి అనుభవించేటట్లు చేస్తుంది. అందుకే ఆమెకు ఆధ్యలక్ష్మీ అని పేరు.*

Related Posts