YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గుంటూరు పార్లమెంట్ పై గురి...

గుంటూరు పార్లమెంట్ పై గురి...

గుంటూరు, ఆగస్టు28,
గుంటూరు పార్లమెంట్….అధికార వైసీపీకి ఆధిక్యం ఉన్న స్థానం. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్నీ అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే గతంలో అధికారంలో చంద్రబాబు, గుంటూరు పరిధిలో ఉన్న అమరావతి ప్రాంతాన్నే రాజధానిగా ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ టీడీపీకి తిరుగుండదని అంతా అనుకున్నారు. కానీ గత ఎన్నికల్లో పరిస్థితి తారుమారైంది. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 స్థానాల్లో 6 అసెంబ్లీ స్థానాలు వైసీపీనే గెలిచింది. ఇక ఒక్క గుంటూరు వెస్ట్‌లో మాత్రమే టీడీపీ గెలిచింది. అలాగే గుంటూరు ఎంపీ సీటు కూడా స్వల్ప మెజార్టీతో టీడీపీనే గెలుచుకుంది. అయితే గుంటూరు వెస్ట్‌లో గెలిచిన మద్దాలి గిరి సైతం ఇప్పుడు వైసీపీ వైపున‌కు వెళ్ళిపోయారు. దీంతో పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలన్ని వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి.ఇక ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉండటంతో ఇక్కడ ఆ పార్టీకి కాస్త ఆధిక్యం ఉంది. ఇటీవల పంచాయ‌తీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ హవానే నడిచింది. అధికారంలో ఉండటం వల్లే వైసీపీ గెలుపు ఇక్కడ సులువు అయ్యింది. కానీ అండ‌ర్ క‌రెంట్‌గా గుంటూరు పార్లమెంట్ పరిధిలో సైకిల్ స్పీడ్ పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రాజధాని అమరావతి ఇష్యూ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ సాధారణ ఎన్నికల్లో టీడీపీకి కలిసొస్తుందని అంటున్నారు. పైగా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు కూడా మెరుగ్గా లేదని, అదే సమయంలో టీడీపీ నేతలు బాగానే పుంజుకుంటోన్న ప‌రిస్థితి ఉంది.
అసలు అమరావతి ప్రాంతంలో కీలకంగా ఉన్న తాడికొండలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని, రాజధాని అంశమే ఆమెకు షాక్ ఇస్తుందని చెబుతున్నారు. సొంత పార్టీలోనే ఆమెను ఎక్కువ మంది నేత‌లు టార్గెట్ చేస్తుండడం కూడా ఆమెకు బిగ్ మైన‌స్ అవుతోంది. మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిది అదే పరిస్థితి. విచిత్రం ఏంటంటే పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు ఏ అంశాల‌పై అయితే ఆళ్ల పోరాటం చేశారో అవే ఇప్పుడు ఆయ‌న‌కు మైన‌స్ అయ్యాయి. రాజ‌ధాని మార్పు విష‌యంలో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు స‌మాధానం చెప్పేందుకు కూడా దిక్కూ దివాణం లేకుండా పోయింది.ఇక్కడ నారా లోకేష్‌కు అడ్వాంటేజ్ వస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇక ఇటీవలే జైలుకు వెళ్లొచ్చిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకు సానుభూతి పెరిగిందని, పొన్నూరులో ఆయనకు బలం పెరిగిందని, అదే సమయంలో అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య ఎఫెక్టివ్‌గా పనిచేయట్లేదని చెబుతున్నారు. పైగా రోశ‌య్య జ‌న‌సేన‌తో పాటు ఓ సామాజిక వ‌ర్గం నేత‌ల‌కు అనుకూలంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శలు ఆయ‌న‌పై తీవ్రంగా వ‌చ్చేశాయి.తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేద‌ల‌కు కేటాయించిన భూముల విష‌యంలో భారీగా అవినీతికి పాల్పడ్డార‌న్న విమ‌ర్శలు ఎదుర్కొంటున్నారు. గుంటూరు వెస్ట్‌లో మద్దాలి గిరి చుట్టూ పార్టీలో మూడు గ్రూపులు ఉన్నాయి. అస‌లు ఆయ‌న వైసీపీ చెంత ఉన్నా చేయ‌డానికి కూడా ఏం లేదు. ఇక గుంటూరు ఈస్ట్‌లో మహమ్మద్ ముస్తఫా పనితీరు కూడా అంతంత మాత్రమే అని, ప్రత్తిపాడులో హోం మంత్రి సుచరితకు కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు త‌గ్గుతోంది. పేరుకు ఆమె కీల‌క శాఖ‌కు మంత్రిగా ఉన్నా నియోజ‌క‌వ‌ర్గంపై పార్టీలోనూ, అభివృద్ధిలోనూ ముద్ర వేయ‌లేక‌పోతోన్న ప‌రిస్థితి. మొత్తం మీద చూసుకుంటే గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఫ్యాన్ ఎమ్మెల్యేలే సైకిల్ స్పీడ్ పెంచుతున్నారు.

Related Posts