YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జనాల్లో ఉండే వారికే టిక్కెట్లు

జనాల్లో ఉండే వారికే టిక్కెట్లు

గుంటూరు, ఆగస్టు 28, 
చంద్రబాబు చుట్టూ ఒక వలయం ఉంది. వాళ్ళంతా పాతికేళ్ల క్రితం నుంచి బాబుతో ఉంటున్న వారే. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ జమానాలోనూ వారే చంద్రబాబు వర్గంలో కనిపిస్తారు. అటువంటి వారంతా ఇపుడూ బాబు భజన బృందంలో ఉన్నారు. వారిని దాటుకుని చంద్రబాబు ముందుకు రాలేకపోతున్నారు. బయటకు చూడలేకపోతున్నారు. మరో వైపు చూస్తే టీడీపీ గత రెండేళ్ళుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. చంద్రబాబు మార్క్ రిపేర్లు ఎన్ని చేసినా కూడా కూడా అసలు కదలిక లేదు. చంద్రబాబు నుంచి ఆదేశాలు జారీ వస్తే దిగివున వున్న వారంతా లైట్ గా తీసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరి సొంత పనులలో వారు ఉన్నారు.కొంతమంది నేతలు అధికార పార్టీకి ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తున్నారు. మరో మూడేళ్ల పాటు జగన్ సర్కార్ ఏపీలో ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి అనుకూలంగా నడచుకుంటే తమ వ్యాపార వ్యవహారాలు అన్నీ కూడా చక్కబెట్టుకోవచ్చు అన్న అతి తెలివితో వ్యవహరిస్తున్నారు. వీరంతా కూడా టీడీపీలోనే ఉంటార‌ట. కానీ ఇపుడు పార్టీ కోసం బయటకు వచ్చి అసలు పోరాడర‌ట. ఎన్నికలు ఏడాది ఉన్నాయి అనగానే అపుడే బ‌య‌ట‌కు వస్తారట. ఎటూ తాము అన్ని రకాలుగా బలవంతులం కాబట్టి చంద్రబాబు ఖ‌చ్చితంగా టికెట్లు తమకే ఇస్తారు అన్న ధీమా అయితే వీరిలో బాగా ఉంది.మరి ఇపుడు పోరాటం చేయకపోతే అపుడు టికెట్ తెచ్చుకుని ఏం లాభం అంటే అయిదేళ్ల తరువాత జగన్ సర్కార్ మీద వచ్చే యాంటీ వేవ్ లో తాము గెలుస్తామని చెబుతున్నారు. అలా యాంటీ వేవ్‌ రాకపోతే సంగతేంటి అంటే ? అలాగే జరుగుతుంది అని కూడా లెక్కలు చెబుతున్నారు. సరే కానీ వీరంతా తాము పార్టీని వదలరు. అలాగని పట్టించుకోరు. అధికార పార్టీ మీద జనాలకు మొత్తితే తామే దిక్కు అన్నట్లుగా ఉంటారు. పైగా చంద్రబాబుకు తామంటే నమ్మకం కాబట్టి త‌మ‌కే టికెట్లు వస్తాయని కూడా చెప్పుకుంటున్నారు. మరి ఇలాంటి నాయకులను తప్పించే సత్తా అధినాయకత్వానికి ఉందా ? అన్నదే ఇక్కడ ప్రశ్న. నిత్యం జనాలలో ఉంటే యువ తరాన్ని తీసుకుని వచ్చి మూడేళ్ళ ముందు నుంచే అధికార పార్టీ మీద పోరాటం చేసే దిశగా పార్టీని కదిలించే స్థితి ఉందా ? అన్నది కూడా తమ్ముళ్ల ప్రశ్నగా ఉంది.ఒకవేళ అలా అనుకున్నా.. ఇపుడు కొత్త వారి చేత జూనియర్ల చేత పోరాటాలు చేయించి తీరా ఎన్నికల వేళకు మాత్రం సీనియర్లకే టిక్కెట్లు కట్టబెడితే మాత్రం ఈసారి త‌మ దెబ్బేంటో చూపిస్తామ‌ని కూడా పార్టీలో నవతరం చెప్పేస్తున్నారు. ఈ రోజు ఎవరైతే జనాల్లో ఉంటారో వారే రేపటి నేతలు, టికెట్లు కూడా వారికే ఇవ్వాలని డిమాండు చేస్తున్నారు. మరి చంద్రబాబు వేసుకునే లెక్కలకు ఈ డిమాండ్లు సరిపోతాయా ? ఆయన ఎంతసేపూ అంగబలం, అర్ధబలం, సీనియార్టీ లాంటి సమీకరణలతో సతమతమవుతారు. అదే జరిగితే మాత్రం టీడీపీని జనాలు తాము మెచ్చి గెలిపించాలేమో కానీ సొంతంగా పార్టీ అయితే పోరులో నిలబడేది కలబడేది ఏదీ ఉండదు అంటున్నారు తమ్ముళ్ళు. ఇక చంద్రబాబు కూడా వైసీపీపై యాంటీ వ‌స్తే జ‌నాల‌కు మాకు ఓట్లేస్తారు.. మేం నిల‌బెట్టినోళ్లనే గెలిపిస్తార‌న్న భ్ర‌మ‌ల్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌రిస్థితి కూడా లేదు.

Related Posts