YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

విద్యారంగంపై జగన్ దృష్టి

విద్యారంగంపై జగన్ దృష్టి

విజయవాడ, ఆగస్టు 28, 
జగన్ ఏం చదివారు అని విపక్ష టేడీపీ ఎన్నో సార్లు ఎగతాళీ చేసింది. ఆయన గురించి చులకనగా మాట్లాడింది. అయితే జగన్ కి చదువు విలువ తెలుసు అనడానికి ఆయన రెండున్నరేళ్ల పాలన కళ్ళ ముందు కనిపిస్తోంది. నాడు నేడు పేరిట ఆయన విద్యారంగానికి వేల కోట్ల బడ్జెట్ కేటాయించి అభివృద్ధి ఏంటి అన్నది చూపిస్తున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో విద్యా విప్లవమే తీసుకువచ్చారని చెప్పాలి. అంతే కాదు చదువుకొన‌డమే ఇప్పటిదాకా చూసిన జనాలకు ఫీజుల బాధ లేకుండా చదివిస్తున్న ఘనత కూడా జగన్ దే అని చెప్పాలి.ఏపీలో జగన్ విద్యారంగంపై చూపుతున్న శ్రద్ధ, ఆయన అమలు చేస్తున్న కార్యక్రమాలను చూసి దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఫాలో కావాల్సిందే అంటారు. ఇప్పటికే తెలంగాణా సర్కార్ ఏపీలో అమలవుతున్న నాడు నేడు ప్రొగ్రాం గురించి తెలుసుకుని సాఫ్ట్ వేర్ ని కూడా అడిగి మరీ తీసుకెళ్ళింది. ఇక ఏపీలో అమ్మ ఒడి పేరిట జగన్ పేదలకు పెద్ద ఎత్తున ఆర్ధిక భరోసా కల్పిస్తున్నారు. అదే విధంగా విద్యా కిట్లు ఇస్తూ బడుగులకు పైసా కూడా భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. దానికి తోడు అన్నట్లు ఇపుడు ఫీజుల విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం తొలిసారిగా కచ్చితమైన నిబంధనలు పెట్టడమే కాదు, ఎంత వసూలుచేయలన్నది కూడా నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఏపీలోని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు.విద్యా సంస్థల పేరిట వ్యాపారం చేసేవారికి జగన్ సర్కార్ గట్టి ఝలక్ ఇచ్చేసింది. ఫీజులను ఇష్టం వచ్చినట్లుగా ఇన్నాళ్ళూ వసూల్ చేస్తున్నారు. దీనికి ఒక తార్కిక విధానం అంటూ ఏమీ లేదు. ఇక్కడ బేరాలు కూడా అసలు లేవు. ఫీజు ఎవరికి తోచిన విధంగా వారు యధేచ్చగా వసూల్ చేస్తూ పోయారు. అదేమని అడిగినా ప్రభుత్వం నుంచి కూడా నాడు స్పందన ఉండేది కాదు. కానీ ఇపుడు జగన్ రూల్స్ మొత్తం మార్చేశారు. ఫీజులు కచ్చితంగా ఇంత మాత్రమే వసూలు చేయలంటూ గట్టి నిబంధనలు విధించారు. అంతే కాదు కళాశాలకు కూడా ఫీజులను తొలిసారిగా నిర్ధారించడం విశేషం. మూడు కేటగిరీలుగా వీటిని విభజించి మరీ సమంజసమైన విధానాన్నే ప్రభుత్వం తీసుకువచ్చింది. హాస్టల్ లో ఉన్న వారికి ఫీజులను కూడా ప్రభుత్వమే నిర్ధారించింది. అలాగే స్కూల్ బస్సుకు ఎంత వసూలు చేయాలన్నది కూడా తెలియచేస్తూ వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.ఏపీలో చేసిన విధంగా దేశంలో కూడా ఇంతవరకూ జరగలేదు. ఒక వైపు ప్రభుత్వ పాఠశాలకు కొత్త రూపు తెస్తూ అక్కడ హాజరుని పెంచుతున్న జగన్ ప్రభుత్వం మరో వైపు ప్రైవేట్ విద్యా సంస్థల మీద కొరఢా ఝలిపించింది. దీని వల్ల మధ్యతరగతి వర్గాలు కూడా అతి పెద్ద ఊరటను పొందుతున్నాయి. నిజానికి ఫీజుల భారం వల్ల తల తాకట్టు పెట్టి అయినా పిల్లలను చదివించాలని పడుతున్న ఆరాటం ఎన్నో కుటుంబాలను గుల్లను చేస్తోంది. ఏది ఏమైనా ఏపీలో ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా సంస్కరణలు దేశానికే ఆదర్శమని విద్యావేత్తలు అంటున్నారు. ఇదే తీరున అంతా అమలు చేస్తే దేశంలో చదువుకొనే రోజులు పోయి చదువుకునే రోజులు వస్తాయని అంటున్నారు.

Related Posts