YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలి

మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలి

- మంత్రి పద్మరావ్ కు వ్యతిరేకంగా రెండవరోజు కొనసాగుతున్న జర్నలిస్ట్ ల దీక్ష. 
-  స్వచ్చందంగా మద్దతు తెలుపుతున్న నియోజకవర్గ ప్రజలు 

- లష్కర్ విలేకరులను బెదిరించే ప్రయత్నం చేస్తావా అంటూ సి ఎమ్ ఓ కార్యాలయం మంత్రి పద్మరావ్  పై ఆగ్రహం** 

సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్  పాదయాత్రలో భాగంగా జర్నలిస్ట్ లను కించపర్చిన మంత్రి పద్మారావు ......
ఆయన వాఖ్యలు ఆయన మాటల్లోనే..

 మీరు రాసే వార్తలు ప్రజలు నమ్మరు.....!

 పిచ్చకుంట్ల వార్తలు...ప్రజలు నమ్మితే నేను కూడా  జర్నలిస్ట్ ని ఐత. రాజకీయ నాయకుని ఎందుకైత...

  మంత్రి గారు.....జర్నలిస్ట్ లు లేకపోతే తెలంగాణ వచ్చేద.....లేకపోతే....నీ పక్కల ఉన్న పి ఆర్ ఓ పీలి కృష్ణ లీలలు జర్నలిస్ట్ బహిరంగ పరిచే దాకా నీకే తెలియదాయే..

 జర్నలిస్టులు రాస్తున్న వర్తలతోనే అనేక కుంభకోణాలు బయట పడి ప్రముఖులు జైళ్ల పాలవుతున్నారు.గవర్నర్ తివారి లాంటి ఉద్దండున్ని రాసలీలలు బహిర్గతం చేసింది కూడా విలేకరులే దాని వలన ఏమి జరిగిందో మరచి పోయావా మంత్రి పద్మారావు....

సికింద్రాబాద్ నియోజకవర్గం అభివృద్ధి పై మేము వాస్తవాలు రాయడం ప్రారంబిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో నీకు ఒక్క ఓటు కుడా రాదు..తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వార్తలు సేకరించి రాస్తున్న విలేకరుల పట్ల మంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు. బేషరతుగా మంత్రి తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని రెండవరోజు కొనసాగుతున్న దీక్షకు వివిధ పార్టీలు కుల సంఘాల నుంచి భారీగా మద్దతు లభించడంతో పాటు ధర్నా ధీక్షలో  పాల్గొంటున్న నేతలు

Related Posts