సికింద్రాబాద్
సికింద్రాబాద్ కోర్టు శనివారం నాడు తీన్మార్ మల్లన్నకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఐపీసీ 306, 511 సెక్షన్స్ పెట్టడం పై తీన్మార్ మల్లన్న తరుపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పిర్యాదుదారుడు ఎలాంటి సూసైడ్ అట్టెంట్ చేయలేదని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని పరిశీలిస్తామని కో్ర్టు వెల్లడించింది. 7 రోజుల పాటు కస్టడీ కావలని చిలకలగూడా పోలీసులు కోరారు. నిందితుడి తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. తీన్మార్ మల్లన్నను చంచల్ గూడ జైల్ కి తరలించారు. ఈ నేపధ్యంలో సికింద్రాబాద్ కోర్టు సముదాయంలో పోలీసులు భారీగా మోహరించారు. బారీ గేట్లు ఏర్పాటు చేసారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు.