YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశంలో పెరిగిన క‌రోనా కేసులు.. నిన్న‌టికంటే 12 శాతం అధికం... డెల్టా వేరియంట్ తో రోగులు ఆస్ప‌త్రిపాల‌య్యే ముప్పు రెండు రెట్లు అధికం

దేశంలో పెరిగిన  క‌రోనా కేసులు.. నిన్న‌టికంటే 12 శాతం అధికం... డెల్టా వేరియంట్ తో రోగులు ఆస్ప‌త్రిపాల‌య్యే ముప్పు రెండు రెట్లు అధికం

న్యూఢిల్లీ ఆగష్టు 28
దేశంలో మ‌రోమారు క‌రోనా కేసులు పెరిగాయి. శుక్ర‌వారం 44 వేల కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా అవి 46 వేల‌కు పెరిగాయి. ఇవి నిన్న‌టికంటే 12 శాతం అధిక‌మ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. కాగా దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మ‌రో మైళురాయిని అధిగ‌మించింది. 24 గంట‌ల్లో కోటి మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామ‌ని తెలిపింది.దేశంలో కొత్త‌గా 46,759 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య‌ 3,26,49,947కు చేరింది. ఇందులో 3,18,51,802 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకోగా, 4,37,370 మంది మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు. మ‌రో 3,59,775 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. కాగా, శుక్ర‌వారం ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కొత్త‌గా 509 మంది మ‌ర‌ణించ‌గా, మ‌రో 46,759 మంది బాధితులు కోలుకున్నార‌ని వెల్ల‌డించింది. ఇక దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 62,29,89,134 డోసుల‌ను పంపిణీ చేశామ‌ని పేర్కొన్న‌ది. ఇందులో గ‌త 24 గంట‌ల్లో కోటీ 3ల‌క్ష‌ల 35వేల 290 మందికి వ్యాక్సినేష‌న్ చేశామ‌ని తెలిపింది.

క‌రోనా వైర‌స్‌ అల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్ సోకిన రోగులు ఆస్ప‌త్రిపాల‌య్యే ముప్పు రెండు రెట్లు అధిక‌మ‌ని తాజా అధ్య‌య‌నం వెల్ల‌డించింది. బ్రిట‌న్‌లో 40,000 కొవిడ్‌-19 కేసుల వివ‌రాల‌ను ప‌రిశీలించిన మీద‌ట లాన్సెట్ ఇన్ఫెక్షియ‌స్ డిసీజెస్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైన అధ్య‌య‌నం ఈ విష‌యం నిగ్గుతేల్చింది. అల్ఫా స్ట్రెయిన్‌తో పోలిస్తే డెల్టా సోకిన రోగులు తీవ్ర ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డ‌తార‌ని గ‌తంలో వెల్ల‌డైన అంశాల‌ను తాజా అధ్య‌య‌నం నిర్ధారించింది.అధ్య‌య‌నంలో పాల్గొన్న‌వారిలో ప‌లువురు వ్యాక్సినేష‌న్ పూర్తికాని కేసులో ఉన్నా డెల్టా తీవ్ర‌తను ఇది వెల్ల‌డిస్తోంద‌ని ప‌బ్లిక్ హెల్త్ ఇంగ్లండ్‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్ఫెక్ష‌న్ స‌ర్వీస్ క‌న్స‌ల్టెంట్ ఎపిడెమాల‌జిస్ట్ గవిన్ డ‌బ్రెరా పేర్కొన్నారు. డెల్టా నుంచి వ్యాక్సినేష‌న్ మెరుగైన రక్ష‌ణ క‌ల్పిస్తోంద‌ని, బ్రిట‌న్‌లో న‌మోద‌వుతున్న కేసుల్లో 98 శాతం పైగా డెల్టా కేసులే ఉన్నందున ప్ర‌జ‌లు రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకోవ‌డం శ్రేయ‌స్క‌ర‌మ‌ని డ‌బ్రెరా కోరారు. ఇక అధ్య‌య‌న స‌మ‌యంలో తాము 34,656 అల్ఫా కేసులు., 8682 డెల్టా కేసుల‌ను ప‌రిశీలించామ‌ని తెలిపారు.

Related Posts