రేవంత్ పై విమర్శలు..కాంగ్రెస్ నేతలే మెచ్చుకుంటున్నారు
మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్
నా సవాల్ కు రేవంత్ రెడ్డి తుస్సుమన్నడు. కొండను తొవ్వు ఎలకను పట్టినట్లు..జిరాక్స్ పేపర్లు తెచ్చు ,భూకబ్జా ఆరోపణలు చేసాడని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. ఏదైనా చెప్తే నమ్మెటట్లు ఉండాలి..ఊరికే బుదర జల్లితే సరిపోద్దా. జవహర్ నగర్ లో మొత్తం ప్రభుత్వ భూమే ఉంది ..దేశంలో ని చాలా ప్రాంత ప్రజలు సొంత ఇళ్ళులు కట్టుకున్నారు. కనీస మౌలిక వసతులు లేని జవహర్ నగర్ లో టిఆర్ఎస్ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించింది. జవహర్ నగర్ లో 330 ఎకరాల లో ఉన్న పేద ప్రజల ఇళ్ళకు పట్టాలిచ్చాము. జవహర్ నగర్ లో నా కోడలు పేరుమీద 448 సర్వే నెంబర్ లో 350 గజాల భూమి ఉంది. జవహర్ నగర్ లో పేద ప్రజలకు హాస్పిటల్ లేదు.. అందుకే ఆస్పిటల్ నిర్మించామని అన్నారు. మెడికల్ కాలేజీ కోసం రోగులు అవసరం.....స్థానికంగా ఉండే ప్రజలకు వైద్యం మా మెడికల్ కాలేజీ ద్వారా అందిస్తున్నాం. నన్ను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. టీడీపీ లో ఎంపీ అయిన దగ్గర నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. 2014 లో మల్కాజిగిరి ఎంపీ సీటు నేను తీసుకున్నాననే కోపంతో రేవంత్ రెడ్డి నా కాలేజీలు మూయిస్తా అని బెదిరించాడు. నేను అప్పుడు చంద్రబాబు కు కూడా ఫిర్యాదు చేసానని అన్నారు.
ఈ దేశంలో మొదటి గర్ల్స్ కాలేజీ పెట్టింది నేనే. దొంగ కాగితాలు చూపెట్టి నాపై ఆరోపణలు చేస్తున్నాడు. మల్లారెడ్డి కాలేజీలలో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా అని రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగితే..హెచ్ ఆర్డీ మినిస్టర్ ఏంప్రాబ్లమ్ లేదని చెప్పారు. ఢిఫెన్స్ కమిటీ లో ఉండాలని ఎంపీ రేవంత్ రెడ్డి కి నేనే సూచించా. కంటోన్మెంట్ లో ఢిఫెన్స్ కమిటీ పర్యటించినప్పుడు..ఇక్కడ నివాస స్థలాలు ,ఫంక్షన్ హాల్ లు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసాడు . రేవంత్ రెడ్డి ఇంధ్రవెళ్ళి కి ప్రేమ్ సాగర్ ను ,ర్యావిరాల సభకు మల్రెడ్డి బ్రదర్స్ ను బలి చేసిండు. మూడు చింతల పల్లి లో వజ్రేష్ యాదవ్ ను , హరివర్దన్ ను బలిచేసాడు. ఓక్కో మీటింగ్ కు రేవంత్ రెడ్డి రావాలంటే 50లక్షలు డిపాజిట్ చేయాలి. మరో సభకు బకరా కోసం నేతను వెతుకుతున్నాడు. చెట్టు ను ,చెరువును చూస్తే కేసీఆర్ గుర్తుకు వస్తాడు. దివాళా తీసిన పార్టీ కి రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాడు. రేవంత్ రెడ్డి ,బండి సంజయ్ కేసీఆర్ ను తిడితే ప్రజలే బుద్ధి చెపుతారు. గుండ్ల పొచంపల్లి లో 21 ఎకరాల లో నా యూనివర్సిటీ ఉంది. రేవంత్ రెడ్డి 650 సర్వే నెంబర్ లో నా యూనివర్సిటీ ఉందని ఆరోపించారు. అసలు 650 సర్వే నెంబర్ లో నాకు భూమే లేదు. నాకు 600 ఎకరాల కు రైతు బందు వస్తుందని సీతక్క ఆరోపిస్తున్నారు..కాలేజీలు ఉన్న భూమికి రైతు బందు ఎలా వస్తుంది..మీకు తెలియదా. సీతక్క మంచిదే..రేవంత్ రెడ్డి మాయ మాటలు చెపుతున్నాడు. శ్రీనివాస్ రెడ్డి సొంత బామ్మర్ది కాదు..చాలా దూరపు చుట్టం. శ్రీనివాస్ రెడ్డి కి 16 ఎకరాల భూమి ఉంది.. పట్టా కూడా ఉంది. నా యూనివర్సిటీ భూమిలో శ్రీనివాస్ రెడ్డి భూమి లేదు. నేను పాలు ,పూలు అమ్మి అభివృద్ధి చెందినని అన్నారు. మరి రేవంత్ రెడ్డి ఏం చేసి సంపాదించిండు. రేవంత్ రెడ్డి మర్యాద తెలుసుకోవాలి. నేను తలుచుకుంటే రేవంత్ మైండ్ బ్లాక్ అయితది. రేవంత్ పై నా కామెంట్స్ చూసి ..కాంగ్రెస్ వాళ్ళే నాకు ఫోన్ చేసి మెచ్చుకుంటుంన్నారని అన్నారు. .