YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడానికే పాదయాత్ర: బండి సంజయ్‌

తెలంగాణ ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడానికే పాదయాత్ర: బండి సంజయ్‌

తెలంగాణ ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడానికే పాదయాత్ర: బండి సంజయ్‌
హైదరాబాద్‌ ఆగష్టు 28
రాష్ట్రంలో పార్టీ బలోపేతం లక్ష్యంగా బీజేపీ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ శనివారం ఘనంగా ప్రారంభమైంది.  భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి.. పాదయాత్ర మొదలుపెట్లారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్, ఇతర ముఖ్య నేతలు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబర్‌ 2వ తేదీ వరకు 36 రోజుల పాటు 'ప్రజా సంగ్రామ యాత్ర' పాదయాత్ర సాగనుంది.  ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ' తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన లేదు.. కుటుంబ పాలన ఉంది. తెలంగాణ ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడానికే పాదయాత్ర నిర్వమిస్తున్నాం. ప్రజా సంగ్రామయాత్రకు ప్రజల సహకారం కావాలి. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం.' అని తెలిపారు.
కల్వకుంట్ల కుటుంబం బంగారు కుటుంబంగా మారింది'
 కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. 'ఉద్యమకారులను ఆకాంక్షకు విరుద్దంగా టీఆర్‌ఎస్‌ పాలన కొనసాగుతుంది. ఏళ్లయినా బంగారు తెలంగాణ కాలేదు. కల్వకుంట్ల కుటుంబం బంగారు కుటుంబంగా మారింది' అని పేర్కొన్నారు. టీఆర్ఎస్‌ను గద్దె దించటానికే బీజేపీ నేత బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో అవినీతి రూపంలో వేల కోట్లు వృథా అవుతున్నాయని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూమి పేరుతో కేసీఆర్ మోసం చేశారని, బీసీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.
కేసీఆర్‌కు భయం మొదలైంది
కేసీఆర్‌కు భయం మొదలైంది. హుజురాబాద్‌ ఎన్నిక వచ్చిందనే కేసీఆర్‌ నటిస్తున్నారు- డీకే అరుణ ఎన్నికలకు ముందు దళితుడిని సీఎంను చేస్తామన్న కేసీఆర్.. గెలిచాక మాట తప్పారని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఉద్యమ ఆకాంక్షను సీఎం కేసీఆర్.. ఫాంహౌస్‌లో బంధీని చేశాడని తెలిపారు. కేసీఆర్ నియంతృత్వ, అవినీతి పాలనకు త్వరలోనే చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్ ఉప‌ ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.
చార్మినార్ వద్ద ఉద్రిక్తత
చార్మినార్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ సభను చిత్రీకరిస్తోన్న డ్రోన్ కేమెరాను పోలీసులు తీసుకెళుతుండగా రచ్చ ప్రారంభమైంది. డ్రోన్ కెమెరాకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ వర్సెస్ పోలీసులు ఉద్రిక్తతకు పాల్పడ్డారు. రెండు సార్లు పోలీసులకు బండి సంజయ్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో అధికారులతో బీజేపీ నేత మంత్రి శ్రీనివాసులు మాట్లాడుతున్నారు. చార్మినార్ పీఎస్ ముందు బీజేపీ కార్యకర్తలు భారీగా గుమికూడారు.

Related Posts