అదరగొట్టిన రూపాయి
ముంబై, ఆగస్టు 28,
ఇండియన్ రూపాయి అదరగొట్టింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే బలపడింది. శుక్రవారం రోజున ఇండియన్ రూపాయి 53 పైసలు పైకి కదిలింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.69 వద్ద క్లోజ్ అయ్యింది.జూన్ 16 నుంచి చూస్తే.. రూపాయికి ఇదే గరిష్ట స్థాయి. అంటే ఇండియన్ రూపాయి 10 వారాల గరిష్టానికి చేరిందని చెప్పుకోవచ్చు. 74.17 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 74.20 వరకు క్షీణించింది. 73.69 వరకు లాభపడింది.చివరకు 73.69 వద్ద క్లోజ్ అయ్యింది. గత క్లోజింగ్‌తో పోలిస్తే రూపాయి 53 పైసలు బలపడింది. ఏప్రిల్ 16 నుంచి రోజూ వారి ప్రాతిపదికన చూస్తే రూపాయికి ఇదే అతిపెద్ద పెరుగుదల అని చెప్పుకోవచ్చు. వారం ప్రాతిపదికన చూస్తే.. రూపాయి 70 పైసలు లాభపడింది. ఇకపోతే అమెరికా డాలర్ క్షీణించింది. 93.002 వద్ద ఉంది.