YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీకి 155 సీట్లు

టీడీపీకి 155 సీట్లు

టీడీపీకి 155 సీట్లు
శ్రీకాకుళం, ఆగస్టు 28,
ఆంధ్రప్రదేశ్‌లో రాబోది తెలుగు దేశం పార్టీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. 155 స్థానాలలో చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. తాను అధికారంలోకి వస్తే కొంత మంది పెద్దలను పలకరించే వారు ఉండరంటూ అచ్చెన్నాయుడు హెచ్చరించారు. పెట్రోలు, డీజిల్ ధరలకు పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ఆందోళనల్లో అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కొత్త పేట నుంచి కోటబొమ్మాళి రైతు బజార్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో అచ్చెన్నాయుడు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కలిలో ఓ పోలీస్ అధికారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ఒక్క మాట అంటేనే తెగ బాధపడిపొతున్నాడని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక, అలాంటి వారిని పలకరించే వారు కూడా ఉండరంటూ వార్నింగ్ ఇచ్చారు.ఇక, ర్యాలీలు, కార్యక్రమాలకు అడ్డుపడటం తమ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడలేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీఎం జగన్ సామ, దాన, దండోపాయాలు ఉపయోగించి టీడీపీని నాశనం చేయాలని చూశారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపేస్తే టీడీపీని వీడిపోతారని జగన్ భావించారని తెలిపారు. టీడీపీ నాయకుల వ్యాపారాలు నాశనం చేశారని, భూములు స్వాధీనం చేసుకుంటున్నారని మండిపడ్డారు.తనపై కేసులు పెట్టి, అరెస్టులు చేసినా భయపడలేదని అచ్చెన్నాయుడు చెప్పారు. తనను అరెస్ట్ చేసి పంచాయితీలు గెలవాలనుకున్నారని వ్యాఖ్యానించారు. అయితే సర్పంచ్‌లు గెలిచినా నాలుక గీసుకోడానికి పనికిరావని వ్యాఖ్యానించారు. వైసీపీ సర్పంచ్‌లే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. రాబోది టీడీపీ ప్రభుత్వమేనని, 155 స్థానాల్లో విజయదుందుభీ మోగించి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అచ్చెన్న ధీమా వ్యక్తం చేశారు.

Related Posts