YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సోముకు సేమ్ బ్యాచా..

సోముకు సేమ్ బ్యాచా..

విజయవాడ, ఆగస్టు 30, 
పార్టీకి నాయకత్వం మారితే కొంత ఊపు రావాలి. నేతల్లో ఐక్యత కనపడాలి. కానీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో ఇటువంటి వాతావరణం ఏదీ కన్పించడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత నేతలంతా ఐక్యత కనపర్చినట్లు ఎక్కడా కన్పించడం లేదు. ఏ కార్యక్రమంలోనైనా ఒకే బ్యాచ్ కనపడుతుంది. దీనికి కారణం సోము వీర్రాజు నాయకత్వంపై అసంతృప్తి కారణమంటున్నారు.కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేతల్లో ఐక్యత కన్పించేది. పురంద్రేశ్వరి, సుజనా చౌదరి, కావూరి సాంబశివరావు వంటి నేతలు కార్యక్రమాల్లో కన్పించేవారు. ఆయన కూడా అందరినీ కలుపుకుని పోయేవారు. వివిధ ఆందోళన కార్యక్రమాల్లో కూడా సమిష్టిగా పాల్గొనేవారు. కానీ సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత నేతలంతా సైలెంట్ అయిపోయారు.సోము వీర్రాజు ఎక్కడకు వెళ్లినా విష్ణువర్థన్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్, జీవీఎల్ నరసింహారావు వంటి కొద్ది మంది నేతలు మాత్రమే కన్పిస్తున్నారు. సోము వీర్రాజు పార్టీలో తనకంటూ ఒక గ్రూపును ఏర్పాటు చేసుకున్నారని, తనకు నమ్మకమైన వ్యక్తులతోనే ఆయన తరచూ మాట్లాడుతున్నారని చెబుతున్నారు. కొందరిపై సస్పెన్షన్ వేటు వేయడం కూడా ఇందుకు ఉదాహరణాగా చూపుతున్నారు. వైరి వర్గం వారిపై సస్పెన్షన్ వేటు వేసిన సోము వీర్రాజు వారిని దరిదాపుల్లోకి రానివ్వకుండా చూసుకుంటున్నారట.ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అనేక మంది బీజేపీ సీనియర్ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఏపీకి ఎటువంటి పదవులు రాకపోవడం, కంటితుడుపు చర్యగా కేవలం గవర్నర్ గా హరిబాబును నియమించారన్న అసంతృప్తి కూడా నేతల్లో ఉంది. మరికొందరు టీడీపీతో ప్రయాణిస్తేనే పార్టీ అభ్యర్థులు గెలుస్తారని, దానిని సోము వీర్రాజు అడ్డుకుంటున్నారని కూడా కొందరు అసహనంతో పార్టీకి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద సోము వీర్రాజు కొంతమంది ఎంపిక చేసుకున్న నేతలతోనూ పార్టీని ముందుకు తీసుకెళుతున్నారన్నది స్పష్టంగా కనపడుతుంది.

Related Posts